కేన్ విలియమ్సన్.. న్యూజిలాండ్ కెప్టెన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. మిస్టర్ కూల్ కెప్టెన్ అంటూ ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత అటు కేన్ విలియమ్సన్ ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఇక ఈ ఏడాది మెగా వేలం కారణంగా జట్టులోకి కొత్త ఆటగాళ్లు రావడంతో తనదైన కెప్టెన్సీ వ్యూహాలతో కేన్ విలియమ్సన్ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడం ఖాయమని అందరూ భావించారు.


 కానీ ఎందుకో కేన్ విలియమ్సన్ జట్టును ముందుకు నడిపించడం కాదు జట్టుకు భారంగా మారిపోతున్నాడు అని అర్థమవుతుంది. ఈ ఏడాది ఒక్క మ్యాచ్లో కూడా సరైన ప్రదర్శన చేయలేకపోయాడు కేన్ విలియమ్సన్. దీంతో అతని ఆటతీరు పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏడాది 12 మ్యాచ్లు ఆడిన కేన్ విలియమ్సన్ చేసింది కేవలం 208 పరుగులు మాత్రమే. ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా గుర్తింపు ఉన్న కేన్ విలియమ్సన్ మాత్రం  రాణించడం లేదు.


 ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు ఆర్పి సింగ్ కేన్ విలియమ్సన్ ఆటతీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విలియమ్సన్ జట్టులో ఉంటే బాగుంటుంది. అయితే అతడిని తుది జట్టు నుంచి తప్పించినా కూడా బానే ఉంటుంది. ఇంకెంతకాలం అతడిని భరిస్తారు.. అతనొక ప్రొఫెషనల్ క్రికెటర్ కాని స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పుడు అతని జట్టులో కొనసాగించటం అవసరమా. అతను ఒక మంచి వ్యక్తి.. గొప్ప కెప్టెన్ కూడా. కానీ ఓపెనర్గా మాత్రం రాణించలేక పోతున్నాడు. ఇప్పటికైనా జట్టులో మార్పు చేయకపోతే మాత్రం చాలా కష్టం. అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠీలను ఓపెనింగ్ జోడి గా దింపండి అంటూ సన్రైజర్స్ కి సూచించాడు ఆర్పి సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: