ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఈ ఏడాది ఎంతో పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. మొదటి నుంచే పరాజయాల పరంపర కొనసాగించింది ముంబై ఇండియన్స్. ఈ ఏడాది అద్భుతంగా రాణిస్తుందని టైటిల్ విజేతగా నిలుస్తుంది అని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన మొట్టమొదటి జట్టుగా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది ముంబై ఇండియన్స్. జట్టు ఇక ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన తర్వాత అయినా నామమాత్రపు మ్యాచ్ లలో గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ముంబై కి వరుస ఓటములు తప్పడంలేదు. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పదవ ఓటమిని మూటగట్టుకుంది రోహిత్ సేనా. ఈ క్రమంలోనే 15 ఏళ్ళ ఐపీఎల్ హిస్టరీ లోనే ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.


 ఐపీఎల్ హిస్టరీ లోనే మొదటి సారి పాయింట్ల పట్టికలో చిట్ట చివరన నిలిచి ఇక ఐపీఎల్ ప్రస్థానాన్ని ముగించింది ముంబై ఇండియన్స్. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్ లో 13 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు 4 విజయాలు మాత్రమే సాధించింది. కేవలం 8 పాయింట్లతో పాయింట్ల పట్టిక లో చివరి స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో గెలిచిప్పటికి కూడా రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ ప్రాణం పాయింట్ల పట్టిక లో మార్పు ఉండక పోవచ్చు అని తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్ర  లోనే ముంబై ఇండియన్స్ ఇలాంటి అనుభవం చవి చూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: