ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో రానే వచ్చింది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది అనేదానికంటే విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అన్న ఆనందమే బెంగళూరు అభిమానుల్లో ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది మునుపెన్నడూ లేనంతగా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు విరాట్ కోహ్లీ. ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు అనే చెప్పాలి.


 ఈ క్రమంలోనే వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా గుర్తింపు ఉన్న విరాట్ కోహ్లీ ఇలాంటి ప్రదర్శనలు చేయడంపై అటు అభిమానులు కూడా పెదవి విరిచారు. గోల్డెన్ డక్ ఔట్ కావడం పై విమర్శలు కూడా చేశారు. ఇకపోతే ఇటీవల గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం మళ్లీ అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఏకంగా 73 పరుగులు చేశాడు. 169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఏకంగా 18.4 ఓవర్లలోనే టార్గెట్ చేదించి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది.


 కానీ ప్రస్తుతం బెంగళూరు జట్టు ప్లే ఆప్ లో ఉంటుందా లేక ఇంటి బాట పడుతుందా అన్నది మాత్రం అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన ఆధారపడి ఉంది అని చెప్పాలి. శనివారం రోజున ముంబై ఇండియన్ ఢిల్లీ కాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ కాపిటల్స్ ఓడితేనే బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది అని చెప్పాలి.  ప్రస్తుతం ఎనిమిది విజయాలతో ఉన్న బెంగళూరు జట్టు నాలుగో స్థానంలో కొనసాగుతుండగా 7 విజయాలతో ఢిల్లీ జట్టు 5వ స్థానంలో ఉంది. అయితే అటు రన్ రేట్ చూసుకుంటే మాత్రం బెంగళూరు కంటే ఢిల్లీ మెరుగైన పరిస్థితిలో ఉంది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: