ఇటీవల ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారిపోయింది. అటు గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకున్న నేపథ్యంలో ఆర్ సిబి తో గెలిచినా ఓడినా పెద్దగా తేడా ఉండేది కాదు. కానీ అటు బెంగళూరు జట్టుకు మాత్రం గుజరాత్ లో జరిగిన మ్యాచ్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే కీలకమైన మ్యాచ్ లో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 18.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.


 అయితే ఇటీవలే గుజరాత్ లో జరిగిన మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ మళ్లీ టచ్ లోకి వచ్చేసాడు. గత కొంత కాలం నుంచి పేలవా ప్రదర్శన కారణంగా తీవ్ర స్థాయిలో నిరాశపరుస్తున్న విరాట్ కోహ్లీ ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం అదరగొట్టేశాడు అనే చెప్పాలి. ఏకంగా 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక గుజరాత్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్  తొలి బంతికి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు.


 రషీద్ ఖాన్ ఓవర్లో డుప్లేసెస్ వికెట్ కోల్పోయినా ఆ తర్వాత క్రీజు లోకి వచ్చాడు మాక్స్ వెల్. అయితే రషీద్ ఖాన్ గూగ్లి వేశాడు. దీనిని మ్యాక్స్వెల్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతిని మిస్ చేశాడు. ఇక ఆ బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. కానీ బెయిల్స్ ఎగిరి నప్పటికీ అవి కింద పడలేదు. రూల్స్ ప్రకారం బెయిల్ కింద పడితేనే బ్యాట్స్మన్ అవుట్ అయినట్లు లెక్క. దీంతో రెండో వికెట్ తీశాను అన్న ఆనందం రషీద్ ఖాన్ కు ఎంతసేపు మిగలలేదు. ఆ తర్వాత వీర విహారం చేసిన మ్యాక్స్వెల్  18 బంతుల్లో 5 ఫోర్లు రెండు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl