RCB (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు) మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి, GT (గుజరాత్ టైటాన్స్‌) వైస్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌కు ఓ అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. సదరు బహుమతిని అందుకున్న రషీద్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంతకీ ఏమిచ్చాడంటే, కోహ్లీకి ఎంతో ఇష్టమైన బ్యాట్‌ గురించి అందరికీ తెలిసినదే. అదే MRF బ్యాట్. దాన్నే రషీద్ కి కానుకగా సమర్పించాడు. దాంతో రహీద్ కళ్ళల్లో ఆనందభాష్పలు రేగాయి. ఇకపోతే కొన్నాళ్ళనుండి వారి మధ్య చిగురిస్తున్న స్నేహం గురించి క్రికెట్ ప్రేమికులకు తెలియంది కాదు.
 
ఓ కీలకమైన మ్యాచ్‌కు ముందు RCB ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ప్రాక్టీసు చేస్తుండగా.. రషీద్‌ ఖాన్‌ కూడా అక్కడే ఉండటం మనం గమనించవచ్చు. ఈ క్రమంలో కోహ్లి తన బ్యాట్‌ను ప్రత్యర్థి జట్టు స్పిన్నర్‌కు ఇచ్చాడు. ఇందుకు స్పందించిన రషీద్‌ ఖాన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ RCB బ్యాటర్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా, తాము మైదానంలో కలుసుకున్న వీడియోను కూడా షేర్‌ చేసాడు. అంతేకాకుండా ‘‘నిన్ను కలవడం ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుంది కోహ్లి. గిఫ్ట్‌ ఇచ్చినందుకు చాలా థాంక్స్‌’’ అని తన అభిమానాన్ని చాటుకున్నాడు.  
 
దాంతో ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు వారి స్నేహాన్ని కామెంట్ల రూపంలో కొని యాడుతున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ తబ్రేజ్‌ షంసీ.. ‘‘నా కోసం ఆ బ్యాట్‌ సేఫ్‌గా పెట్టు బ్రదర్‌.. తొందర్లోనే నీ నుంచి నేను లాక్కొంటా’’ అని సరదాగా కామెంట్‌ చేయడం మనం గమనించవచ్చు. ఇక ఈ సీజన్‌ లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్గన్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌ 16 వికెట్లు తీసిన సంగతి తెలిసినదే. ముఖ్యంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 11 బంతుల్లో 31 పరుగులతో రషీద్‌ రాణించిన తీరును అభిమానులు మర్చిపోలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: