పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం PCB (పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు) నిబంధనలను ప్రతిఘటించాడు. లాహోర్‌ లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌ అత్యంత మౌళిక సదుపాయాలు కలిగి ఉంటుంది. ఈ సెంటర్‌కు PCB అధికారులు, అంతర్జాతీయ ఆటగాళ్లు, ఫస్ట్‌క్లాస్‌, జూనియర్‌ క్రికెటర్లు మినహా వేరెవరికి ప్రవేశం లేదు. ఇటీవలే బాబర్‌ ఆజం తన సోదరుడు సఫీర్‌ ఆజంను ప్రాక్టీస్‌కు తీసుకొచ్చాడు. కాగా సఫీర్‌ ఆజం ఇంత వరకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లో ఆడలేదు. తన సోదరుడితో నెట్‌ ప్రాక్టీస్‌ లో బౌలింగ్‌ చేయించి శిక్షణ లో మెళుకువలు ఇచ్చాడు. స్వయం గా తానే పరిశీలించిన బాబర్‌ బౌలింగ్‌ టెక్నిక్స్‌ వివరించాడు.
 
ఇక ఈ తతంగాన్ని అంతా బాబర్‌ ఆజం సోదరుడు సఫీర్‌ ఆజం ట్విటర్లో షేర్‌ చేయడం తో విషయం వెలుగు లోకి వచ్చింది. బాబర్‌ ఆజం చేసిన పనిపై PCB అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. నిబంధనలను అతిక్రమించిన బాబర్‌పై PCB ఇకపై ఏం చర్యలు తీసుకుంటుందో అని యావత్ పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది. బాబర్‌ ఆజం మూడు నాలుగు రోజుల క్రితమే తన సోదరుడి తో కలిసి క్యాంప్‌ను సందర్శించాడు. అయితే కేవలం చూడడానికి వచ్చాడనుకొని అనుమతి ఇచ్చామని.. కానీ సఫీర్‌ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడన్న విషయం తొలుత మా దృష్టికి రాలేదు అని PCB అధికారుల్లో ఒకరు అన్నారు.  
 
తాజాగా ఈ విషయం తెలియడం తో PCB అధికారులు బాబర్‌ ఆజంపైన క్రమ శిక్షణ రాహిత్య చర్యలకు అనుగుణం గా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఏదిఏమైనా బాబర్‌ ఆజం యొక్క నాయకత్వాన్ని వీళ్ళెవరూ శంకించలేరు అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో బాబర్ కు పెద్ద స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నారు. సపోర్ట్ బాబర్ అనే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: