ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో ఏకంగా ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టు గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి సారి కూడా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా టైటిల్ గెలుస్తుంది అని భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. కాగా అభిమానులు ఎవరు కూడా ఊహించని విధంగా పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. వరుస ఓటములతో సతమతమవుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని జడేజాకు సారధ్య బాధ్యతలు అప్పగించడంతో  చెన్నై సూపర్ కింగ్స్ కి అస్సలు కలిసి రాలేదు.


 ఇక ఆ తర్వాత జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకుని ధోనీకి సారధ్య బాధ్యతలు అప్పగించడంతో ఎందుకో మునుపటి చరిష్మా మాత్రమే కనిపించలేదనే చెప్పాలి. చివరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి నిష్క్రమించిన రెండవ జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇదే సమయంలో ఒక ప్రశ్న తెరమీదికి వచ్చింది   ఇప్పటికే 40 ఏళ్లు దాటిన మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ సీజన్ లో ఆడతాడా లేదా అన్న చర్చ జరిగింది  ఈ క్రమంలోనే అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ధోని వచ్చే సీజన్లో ఆడితే బాగుంటుంది అని  అభిప్రాయం వ్యక్తం చేశారు.


 ఇక దీనికి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ సీజన్ లో కూడా తాను ఆడతాను అంటూ స్పష్టం చేశాడు. ఇక వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తామూ అంటూ వెల్లడించాడు. చెన్నై ముంబై నగరాల్లో మ్యాచ్ లూ ఆడిన తర్వాత అభిమానులకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండడం న్యాయం కాదు అంటూ ధోని వ్యాఖ్యానించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ  నుంచి తనకు ఎంతో అభిమానం లభించిందని చెప్పిన మహేంద్రసింగ్ ధోని 2023లో తనకుచివరి ఏడాది అవుతుందో లేదో అన్న విషయాన్ని వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: