ప్రస్తుతం భారత ఆటగాళ్లు అందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా వివిధ జట్ల తరపున ఆడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపిఎల్ తర్వాత ఇక అటు టీమిండియా వరుసగా సిరీస్ లో ఆడబోతుంది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాతో ఇండియా టీ20 సిరీస్ ఆడేందుకు సిద్దం అయింది అన్న విషయం తెలిసిందే  అయితే దక్షిణాఫ్రికా టి20 సిరీస్ ఆడబోయే ముందు షాక్ తగిలింది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కు హర్షల్ పటేల్ దూరమయ్యే అవకాశం ఉంది.


 ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా హర్షల్ పటేల్ బాగా రాణిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన బౌలింగ్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు. అయితే ఇటీవల హర్షల్ పటేల్ గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో హర్షల్ పటేల్ చేతికి గాయం అయింది  ఇక ఈ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్  గాయం కారణంగా మైదానం వీడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే అటు గాయం తీవ్రత ఎక్కువగా ఉంది అన్నది తెలుస్తుంది.


 దీంతో ఇక ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు ఆడబోయే మ్యాచ్ లకు హర్షల్ పటేల్ దూరం అయ్యే అవకాశం ఉంది. అయితే మే 25 వ తేదీన  దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటించబోతుంది బీసీసీఐ.  అయితే అటు టీమిండియా మాత్రం గాయాల బెడద వెంటాడుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే స్టార్ అల్ రౌండర్ దీపక్ చాహర్ గాయం కారణంగా అటు ఐపీఎల్ సీజన్ తో పాటు ఆఫ్రికా సిరీస్కు కూడా దూరమయ్యాడు  మరోవైపు సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా సైతం మధ్యలో తప్పుకున్నారు.  దీంతో ఈ సిరీస్కు వీరు ముగ్గురు అందుబాటు ఉండటం పై సందిగ్దత నెలకొంది. కాగా దక్షిణాఫ్రికా తొలి టి20 ఢిల్లీ వేదికగా జూన్ 9వ తేదీన జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl