ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఆట తీరు గురించి ప్రపంచ క్రికెట్లో ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు   అతను సాధించిన రికార్డులు అతను ఎంత గొప్ప ఆటగాడు అని చెప్పకనే చెబుతుంటాయి అని చెప్పాలి. కానీ ఈ ఏడాది మాత్రం ఎందుకో విరాట్ కోహ్లీ సరిగ్గా రాణించలేకపోయాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఎంతోమంది అభిమానులు సైతం పెదవి విరిచిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 అయితే దాదాపు అన్ని మ్యాచ్ లలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన కోహ్లీ ఇటీవలే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ జట్టుపై మాత్రం అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. 73 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఒకానొక సమయంలో కోహ్లీ సెంచరీ చేస్తాడు అని ఆశలు పెట్టుకున్నారు అభిమానులూ.  అయితే గుజరాత్ పై బెంగళూరు విజయం తర్వాత మాట్లాడిన కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్లో తాను జట్టు కోసం రాణించలేక పోయాను అని అది తీవ్ర నిరాశకు గురి చేసిందని ఇలా చెప్పుకొచ్చాడు.


 కానీ ఈ మ్యాచ్లో మాత్రం నేను మా జట్టుపై ప్రభావం చూపించగలిగాను. దాంతో మా జట్టు మంచి స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో నా పై భారీ అంచనాలు ఉండడానికి కారణం ఇంతకుముందు నేను ఆడిన విధానమే అంటు విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇలాంటి సమయంలో మన ఆలోచనా దృక్పధాన్ని సరైన స్థితిలో ఉంచడం ఎంతో ముఖ్యం అంటూ తెలిపాడు. దానికి తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలు మాత్రం పట్టించుకోవద్దు అంటూ తెలిపాడు. ఇక నేను ఈ మ్యాచ్లో రాణించేందుకు ఎంతో కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా కోహ్లీ ఫామ్ లో కనిపించడంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: