ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గత కొంత కాలం నుంచి మాత్రం పేలవమైన ఫామ్ కారణంగా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని తెలిసిందే  చివరకు భారత జట్టు తరఫున పేలవ ప్రదర్శన కొనసాగించిన విరాట్ కోహ్లీ ఇటీవలే ఐపీఎల్లో బెంగుళూరు జట్టు తరపున కూడా ఎందుకో అంచనాలకు తగ్గట్టుగా ఆడటం లేదు. ప్రతి మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి తక్కువ పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోవడం లాంటివి చేస్తూ ఉన్నాడు. మరి కొన్ని మ్యాచ్ లలో అయితే చివరికి డక్ అవుట్ అవుతున్న పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆటతీరుపై కేవలం ప్రేక్షకులూ మాత్రమే కాదు అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ విరాట్ కోహ్లీ కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ కం బ్యాక్ చూడాలని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో గుజరాత్ జట్టుపై అద్భుతమైన ఫామ్ కనబరిచాడు విరాట్ కోహ్లీ. ఏకంగా 73 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.


 ఇటీవల ఇదే విషయంపై స్పందించిన కోహ్లీ సన్నిహితుడు టీమిండియా మాజీ కోచ్ రావిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఏంటో నిరూపించుకున్నారు. అదృష్టం కొద్దీ బెంగళూరు ప్లే ఆఫ్ కీ అర్హత సాధిస్తే అక్కడ మరోసారి అతని ఆటను చూసేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఢిల్లీతో వెనకబడితే మనమంతా కాస్త ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఆటతో కేవలం తన విమర్శలనే కాకుండా ప్రపంచానికి కూడా తనతో పెట్టుకోవద్దు అని చెప్పాడు అంటు రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl