అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి లాగా అయింది పరిస్థితి. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చింది. అయితే ఏ దశలోనూ ముంబై బౌలర్ లు కుదురుకోనివ్వలేదు. ఫామ్ లో ఉన్న వార్నర్, మిచెల్ మార్ష్ మరియు పృథ్వీ షాలు పవర్ ప్లే లోనే అవుట్ అయ్యి ఢిల్లీ ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశారు. తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆ వెంటనే వచ్చి అవుట్ అయిపోయాడు. అయితే బుమ్రా ప్రధానంగా చెలెరిగి ఢిల్లీ పతనాన్ని శాసించాడు.

ఇక క్రీజులోకి వచ్చిన పావెల్ పంత్ లు జాగ్రత్తగా ఆచితూచి సింగిల్స్ ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించ సాగారు. వీరిద్దరూ అయిదవ వికెట్ కు 75 పరుగులు జోడించి కాస్త ఢిల్లీ డగ్ అవుట్ లో ఊపిరి పోశారు. లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. పావెల్ నిదానంగా ఆడుతూ స్పిన్నర్ లను టార్గెట్ చేసుకుని ఆటలో వేగాన్ని పెంచాడు. మరో వైపు పంత్ మాత్రం స్ట్రైకింగ్ ఎక్కువగా పావెల్ కు ఇస్తూ వచ్చాడు. కానీ 16 వ ఓవర్ వేసిన రమణ్ దీప్ బౌలింగ్ లో వరుసగా 4 4 6 కొట్టి ఆఖరి బంతికి కీపర్ కే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మిగిలిన నాలుగు ఓవర్లు పంత్ ఉండి ఉంటే, కనీసం 180 అయినా స్కోర్ వచ్చి ఉండేది.

అలా నిర్ణీత ఓవర్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ 50 కు 4 వికెట్లు పడిన స్థితి నుండి అద్భుతంగా కోలుకుని 7 వికెట్లను 159 పరుగులు చేసింది. మరి ఈ స్కోర్ ఈ పిచ్ పై డిపెండ్ చేయడానికి సరిపోతుందా ? పంజాబ్ తో మ్యాచ్ లో ఎలా అయితే సక్సెస్ ఫుల్ గా డిపెండ్ చేశారో అలాగే చేసి అద్భుతమైన విజయంతో ప్లే ఆప్స్ కు వెలుతారా లేదా తెలియాలంటే మరికొద్ది సేపు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: