ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్ గా కొనసాగుతున్న జస్ప్రిత్ బూమ్రా తన బౌలింగ్ తో ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ప్రేక్షకుల అంచనాలకు మించి రాణిస్తూ అదరగొడుతున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టులో ప్రాతినిద్యం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అటు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ముంబై ఇండియన్స్ విషయంలో ఎప్పుడూ తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంటాడు.


 ఇక అతడు అంత ప్రతిభావంతుడు కాబట్టి ముంబై ఇండియన్స్ జట్టు అతన్ని వేలంలోకి వదిలేయకుండా అంటిపెట్టుకుంది అని చెప్పాలి. ప్రతి సీజన్లో భారీగా వికెట్లు పడగొట్టి ఎక్కువ వికెట్లు సాధించిన వీరుడిగా ఉండే జస్ప్రిత్ బూమ్రా.. ఎందుకో ఈ సీజన్లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఆ జట్టు లో ఉన్న అందరు ఆటగాళ్లు విఫలమవుతున్న నేపథ్యంలో ఒత్తిడిలో బుమ్రా కూడా రాణించలేకపోయాడు అని చెప్పాలి. దీంతో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా వికెట్లు మాత్రం తీయలేకపోయాడు.


 ఇకపోతే ఇటీవల ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగం గా మూడు వికెట్లు పడగొట్టాడు జస్ప్రిత్ బూమ్రా. ఈ క్రమంలోనే అరుదైన రికార్డు కాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీ లో వరుసగా ఏడవ ఏడాది 15 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 2016 లో 15, 2017 లో 20 వికెట్లు, 2018లో 17 వికెట్లు, 2019లో 19 వికెట్లు, 2020 లో 27 వికెట్లు, 2021లో 21 వికెట్లు, 2022 లో 15 వికెట్లు తీశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: