ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లీగ్ మ్యాచ్ ల దశ ముగింపుకు చేరుకుంది. ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య ఒక నామమాత్రమైన మ్యాచ్ మాత్రమే జరుగుతుంది. ఇక ఈ లీగ్ మ్యాచ్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో అటు ముంబై ఇండియన్స్ జట్టు కు ఊహించని రీతిలో అనూహ్యమైన మద్దతు లభించింది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ వెళ్లాలంటే తప్పనిసరిగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవాల్సి ఉన్న సమయంలో ముంబై ఇండియన్స్ గెలవాలి అంటూ ఆర్సిబి అభిమానులతోపాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు విజయఢంకా మోగించింది  ముంబై విజయంతో అటు ముంబై అభిమానుల కంటే బెంగళూరు జట్టు అభిమానులే ఆనందంతో ఎగిరి గంతేసారు అని చెప్పాలి. రోహిత్ శర్మ నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అంటూ డైలాగులు కూడా చెప్పేంతగా ఆర్సిబి అభిమానులు ఎమోషనల్ అయ్యారు  ఇలా ముంబై గెలుపు బెంగళూరు జట్టును ప్లే ఆఫ్ లో నిలబెట్టింది  ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఢిల్లీ జట్టుపై ముంబై ఇండియన్స్ గెలుపులో మాజీ ఆర్సిబి ఆటగాడు కీలకపాత్ర వహించాడు అన్నది తెలుస్తుంది. ఒకవైపు ముంబై ఇండియన్స్ వరుసగా వికెట్లు కోల్పోయి కావాల్సిన రన్రేట్ పెరిగిపోతున్న సమయంలో జట్టు గెలవడం కష్టమని అని అందరూ అనుకున్నారు. ఆ సమయంలోనే క్రీజులోకి వచ్చిన టీమ్ డేవిడ్ ఏకంగా 11 బంతుల్లో నాలుగు సిక్సర్లు రెండు ఫోర్ల సహాయంతో 34 పరుగులు చేశాడు. దీంతో అటు కష్టాల్లో ఉన్న ముంబయిని గట్టెక్కించాడు. ఇతను గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. ఇప్పుడు బెంగళూరు ప్లే ఆప్ కి వెళ్లడానికి తన వంతు సహాయం అందించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb