ఏడాది ఐపీఎల్ సీజన్ ఎంతో రసవత్తరంగా సాగింది. అయితే లీగ్ దశ ముగియక ముందే మూడు జట్లు ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకున్నారు. గుజరాత్, లక్నో, రాజస్థాన్ జట్లు వరుసగా మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలోనే నాలుగో స్థానం కోసం తీవ్రస్థాయిలో పోటీచేయగా చివరికి బెంగళూరు జట్టు నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఇలా ప్లే ఆఫ్ లో అవకాశాలు దక్కించుకోవడానికి ముంబై ఇండియన్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఈసారి ప్లేఆఫ్ లో అడుగుపెట్టిన ఆర్సిబి  గెలవడం ఖాయం అంటున్నారు అభిమానులు.


 ఎందుకంటే ఇప్పటివరకు ఆర్సిబి విజయాలకు అదృష్టం తోడు అయ్యిందని.. ఇక ఇవే సాక్ష్యాలు అంటూ చెబుతున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టుతో చావో రేవో తేల్చుకోవాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్లో బెంగళూరు ప్లే అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్లో భాగంగా కోహ్లీ రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. గ్లెన్ మాక్స్ వెల్ క్లీన్ బౌల్డ్ అయిన బేయిల్స్ కింద పడకపోవడంతో చివరికి నాటౌట్గా నిలిచాడు. దీంతో ఇక అదృష్టం కలిసి వచ్చి అటు బెంగళూరు జట్టు విజయం సాధించింది అని అందరూ అనుకున్నారు.

 ఒకవేళ ఈ మ్యాచ్లో బెయిల్ కిందపడి ఉంటే మాక్స్ వెల్ వెనుదిరిగి ఉంటె ఆర్సిబి ఒత్తిడికి లోనయ్యేది. ఒకవేళ ఓడిపోయిన ఆశ్చర్యం కలిగేది కాదు. ఇలా లక్కు మొత్తం ఆర్సిబి కి పేవర్ గా ఉంది అని చెప్పాలి  ఇటీవల ఢిల్లీ ముంబై మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ సి బి కి అదృష్టం వెంటాడింది. క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ బ్యాట్ కి బంతి తాకి నేరుగా  రిషబ్ పంత్  చేతుల్లోకి వెళ్లింది. కానీ రివ్యూకు వెళ్లకపోవడంతో అదృష్టం కలిసి వచ్చింది. ఇక 33 బంతుల్లో 65 పరుగులు చేసి అదరగొట్టాడు టిమ్ డేవిడ్. ఇదే లక్కు ఆర్సిబి వెంట ఉంటుందని ఈసారి కప్పు కొట్టడం ఖాయం అంటున్నారు అందరూ..

మరింత సమాచారం తెలుసుకోండి:

Cup