ఇప్పటి వరకు కెప్టెన్సీలో ఎలాంటి అనుభవం లేని హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మాత్రం తనలో దాగిఉన్న సారథ్య సామర్థ్యం ఏమిటో చూపించాడు  ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ నుంచి బయటకు వచ్చి మొదటి సారి ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న హార్దిక్ పాండ్య గుజరాత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా అతని కెప్టెన్సీపై ఎవరికి కూడా అంచనాలు లేవు. కానీ ఆ తర్వాత మాత్రం హార్దిక్ పాండ్యా తన జట్టుకు వరుస విజయాలు అందిస్తూ ఉండడం చూసి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి అభిమానులుగా మారి పోయారు అందరూ.


 అయితే సరిగ్గా ఐపీఎల్ మెగా వేలానికి ముందు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య ఒక్క సారిగా పుంజుకుని కెప్టెన్సీ లో అదరగొట్టడమే  కాదు ఒక ఆటగాడిగా కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అంతేకాదండోయ్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిపాడు. ఇక ఈ ఏడాది ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకున్న మొదటి జట్టుగా గుజరాత్ కి ఒక అరుదైన రికార్డు సాధించిపెట్టాడు. ఏకంగా 14 మ్యాచులలో పది విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో జట్టును నిలిపాడు.


 కాగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి వందకు వంద మార్కులు ఇస్తాను. అతను ఒక గొప్ప నాయకుడు అంటూ చెప్పుకొచ్చాడు.  బౌలర్ల తో  ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సాధారణంగా కొన్ని సందర్భాలలో  బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ సమయంలోనే కెప్టెన్ వారి పక్కనే నిలబడి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటే వారికి ఊరట అనిపిస్తుంది. ఇక హార్దిక్ పాండ్యా ఇదే చేసి చూపించాడు. హార్దిక్ కెప్టెన్సీ వల్లే గుజరాతి జట్టు ఉన్నత శిఖరానికి వచ్చింది అంటూ ప్రశంసలు కురిపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: