టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే భారత జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. ఒకసారి జట్టుకు ఓపెనర్‌గా బరిలోకి దిగి మంచి ఆరంభాలు అందించేవాడు వీరేంద్ర సెహ్వాగ్. ఏకంగా తన బ్యాటింగ్‌తో బౌలర్లకు సింహస్వప్నం లా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రస్తుతం ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు అలరిస్తూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల ఒక క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. 2007 - 2008 సీజన్లో భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా జరిగిన ఘటన వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. కష్ట సమయాల్లో తనకు అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే  అండగా నిలిచాడు అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో సెలెక్టర్లు తరచూ నన్ను పక్కన పెడుతూ వస్తున్నారు. దీంతో రెండో టెస్ట్ జట్టులో సుదీర్ఘమైన ఫార్మాట్లో పదివేలకు పైగా పరుగులు చేయాలని నా కోరిక. జట్టు నుంచి ఉద్వాసన ఉండకూడదని ఎప్పుడు ఆశ పడుతూ ఉండేవాడిని.


 ఆస్ట్రేలియా సిరీస్ లో రెండు టెస్టుల్లో భారత్ ఓడిన తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఆ తర్వాత టీమిండియా అద్భుత విజయం సాధించింది. నిన్న జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 50 కొడితే జట్టులో స్థానం కల్పిస్తామని కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పాడు అంటూ గుర్తు చేసుకున్నారు. అడిలైడ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 63 సాధించాడు. ఆ తర్వాత జరిగిన సెకండ్ ఇన్నింగ్స్ లో వీరవిహారం చేసి 151 పరుగులు సాధించాడు. కాగా తొలి ఇన్నింగ్స్ లో చేసిన 63 పరుగులే జీవితంలో అత్యంత కష్టతరమైనవీ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అనిల్ కుంబ్లే మద్దతు లేకపోతే నా కెరీర్ ముగిసిపోయేది అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: