రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం భారత జట్టులో ఎంతో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 12 ఏళ్ల క్రితం తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ని మొదలు పెట్టిన రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను చూశాడు అని చెప్పాలి. ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. ఎన్నో విజయాలను సాధించాడు. ఇక ఇప్పుడు యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఉన్నప్పటికీ జట్టులో తన స్థానాన్ని మాత్రం సుస్థిరం చేసుకున్నాడు. తన స్పిన్ బౌలింగ్ తో ఎప్పుడూ మ్యాజిక్ చేస్తూ అదరగొడుతు ఉంటాడు. ఇక ఇటీవల కాలంలో అయితే బ్యాటింగ్లో  కూడా ఇరగదీస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్.


 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టులో అశ్విన్ సభ్యుడిగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో అయితే ఏకంగా దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్ ని సైతం వెనక్కి నెట్టి అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు తన కెరియర్ ప్రారంభంలో టీమిండియా మాజీ కోచ్ ఇచ్చిన సలహా వర్కౌట్ అయింది అంటూ చెప్పుకొచ్చాడు.


 నా కెరీర్లో ఎన్నో పొరపాట్లు చేశానని తెలిపాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే అప్పట్లో టీమిండియాకు హెడ్ గా ఉన్న దంకన్ ఫ్లెచర్ నాకు ఒక సలహా ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్లి నేను ఎలా మెరుగవ్వాలి. బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడిగేవాడిని.. అలా అడిగినప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పారు. నువ్వు బెటర్ గా కావాలంటే తప్పులు చేస్తూనే ఉండాలి.. ఎప్పుడు ప్రేక్షకుల ముందు విఫలమవుతూ ఉండాలి.. ఇదే ఆయన చెప్పిన సూత్రం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇలా ఎన్నో సార్లు విఫలమయ్య.. అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నా.. ఇక నాపై వచ్చిన విమర్శలను సవాల్ గా తీసుకుని సమస్యలన్నింటినీ కూడా అధిగమించా అంటూ రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: