ఐపీఎల్ వేలం లో పాల్గొనాలని.. భారీ ధర పలకాలని..  ఏదో ఒక జట్టు లోకి వెళ్ళిన తర్వాత ప్రతిభ నిరూపించుకోవాలని ప్రతి ఒక్క యువకుడు ఆశ పడుతూ ఉంటాడు. ఇక కొంతమంది ఆశ నెరవేరుతు ఉంటే మరి కొంత మందికి మాత్రం నిరాశే ఎదురవుతుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రమే ఇలా ఐపీఎల్ లో సెలెక్ట్ అవ్వకుండా నిరాశ పడుతున్న వారు. ఆ తర్వాత కాలంలో ఊహించని విధంగా అదృష్టం వరించి ఐపీఎల్లో అడుగు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారూ. ఇటీవల ఐపీఎల్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్లో సెంచరీతో చెలరేగి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విజయం అందించిన రజిత  కూడా ఇలాంటి కోవకు చెందిన ఆటగాడే అని చెప్పాలి.


ఎన్నో ఆశలతో ఐపీఎల్ మెగా వేలం లో పాల్గొన్నాడు.. కానీ ఏ జట్టు కూడా అతని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతనికి నిరాశ ఎదురైంది. కానీ ఇటీవలే అనుకోని అదృష్టం వరించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కొనసాగుతున్న సిసోడియా కు గాయం అయింది. దీంతో అతడి ప్లేస్ ను రీప్లేస్మెంట్ చేసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం రజత్ ను జట్టులోకి తీసుకుంది. ఇక ఇటీవలే రజత్  ఎలిమినేటర్ మ్యాచ్లో సృష్టించిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బౌలర్ ఎవరైనా సరే బౌండరీ లతో విరుచుకుపడుతూ మైదానం మొత్తం దద్దరిల్లి పోయేలా చేశాడు ఈ యువ ఆటగాడు.


 ఇప్పటికీ ముంబై ఇండియన్స్ పుణ్యమా అని అటు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో మొదట్లోనే డూప్లెసిస్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ పరుగులకే విరాట్ కోహ్లీ దినేష్ కార్తీక్ లాంటి ఆటగాళ్లు కూడా వికెట్ కోల్పోవడం గమనార్హం. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రజత్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. మొత్తంగా 54 బంతుల్లో 112 పరుగులు చేశాడు. అతడు ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడని ప్రత్యర్థి బౌలర్లే కాదు అటు బెంగళూరు జట్టు ఆటగాళ్లు కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పాలి. ఒక రకంగా బెంగళూరు జట్టు విజయానికి అతడే కారణం చెప్పడంలో అతిశయోక్తి లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl