షాహిద్ అఫ్రిది.. అప్పట్లో పాకిస్తాన్ క్రికెట్ లో మంచి క్రికెటర్ గా ఎంతోగానో గుర్తింపు సంపాదించుకున్నాడు ఇతగాడు. కానీ మాజీ క్రికెటర్ గా మారిపోయిన తర్వాత మాత్రం నోటికి పని చెప్పాడు. చివరికి బాగా నోటి దురుసు ఎక్కువ అనే ఒక అపవాదును మూటగట్టుకున్నాడు. కొన్ని కొన్ని సార్లు షాహిద్ అఫ్రిది మాటలు చూస్తుంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే భారత్ పాకిస్థాన్ల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు అంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్న వివాదాన్ని మరింత రెచ్చగొట్టేందుకు ఎన్నోసార్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు అఫ్రిది. అయితే ఇప్పుడు మరోసారి నోటిదురుసు ప్రదర్శించాడు.


 దీంతో షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా క్రికెటర్ అమిత్ మిశ్రా అతని పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఇటీవలే కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. దేశ ద్రోహానికి పాల్పడ్డాడు అంటూ అతని పై వచ్చిన అభియోగాలు మొత్తం నిజం అని తేలడంతో  జీవితకాల శిక్ష తో పాటు పది లక్షలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక అంతకుముందు యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ అంశంపై అఫ్రిది ట్విట్టర్ వేదికగా స్పందించాడు.


 భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తిన  వారి గొంతు నొక్కడం ఇంకా కొనసాగుతూనే ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రాన కాశ్మీర్ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితి కోరుతున్నా అంటూ ట్వీట్ చేయగా... దీనిపై స్పందించిన అమిత్ మిశ్రా డియర్  షాహిద్ ఆఫ్రిది యాసిన్ మాలిక్ స్వయంగా నేరాన్ని అంగీకరించాడు. అందరూ నీలాగా బర్త్ డేట్ తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు కదా అంటు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: