మొన్నటి వరకు వరుసగా గాయాల కారణంగా టీమిండియాకు పూర్తిగా దూరమైపోయిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏడాది మాత్రం అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు కెప్టెన్గా ఒకవైపు సారథ్య బాధ్యతలను భుజాన వేసుకుని జట్టును ముందుకు నడిపిస్తూనే మరోవైపు ఒక ఆటగాడిగా కూడా తన సత్తా ఏంటో చూపిస్తూ ఉన్నాడు. ఇక ఈ ఏడాది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఎప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండడమే కాదు ఫైనల్ చేరిన తొలి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది.


 కాగా మొన్నటి వరకు హార్థిక్ పాండ్య తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పై వచ్చిన విమర్శలు గురించి స్పందించిన హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జనాలు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.. అది వారి పని. దానికి నేనేం చేయలేను అంటూ హార్దిక్ పాండ్య తెలిపాడు. హార్దిక్ పాండ్యా పేరు ఎప్పుడైనా అమ్ముడు పోతుంది. దాంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. జనాలు నా గురించి మాట్లాడుకునే మాటలు చిరునవ్వుతోనే తేలిగ్గా తీసుకుంటాను.. ఇక నా జీవితంలో కెరియర్లో ధోనీ బాయ్ దే కీలకపాత్ర. నాకు ఎంతో ప్రియమైన సోదరుడు, ప్రియమైన స్నేహితుడు, కుటుంబం కూడా అతడే.


 నా జీవితంలో అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇక ఇప్పుడు వ్యక్తిగతంగా ఎంతో దూరంగా ఉంటూ అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఉండటం కూడా గర్వంగా అనిపిస్తుంది. కెప్టెన్ గా ఉండటానికి   ముందు కూడా అన్ని పరిస్థితులను ఎంతో ప్రశాంత మనస్తత్వంతోనే చూస్తూ ఉండేవాడిని.. ఇప్పుడు కెప్టెన్ గా మారిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. అలా ఉన్నప్పుడే మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. నా జీవితంలో క్రికెట్ ప్రయాణంలో హడావుడిగా కాకుండా పది సెకండ్లు అదనపు సమయం ఇవ్వాలని భావిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా..

మరింత సమాచారం తెలుసుకోండి: