ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత పేలవమైన ఫాంలో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టినా విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం పరుగులు చేయడానికి కూడా తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఒక మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అని ఆశలు రేకెత్తించే కోహ్లీ తర్వాత మ్యాచ్ లో మాత్రం తక్కువ పరుగులకే వికెట్ కోల్పోతున్నాడు అని చెప్పాలి. మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే కోహ్లీ తన స్థానాన్ని మార్చుకుని ఓపెనర్ గా బరిలోకి దిగినప్పటికీ పరుగులు మాత్రం చేయలేకపోతున్నాడు.


 ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ పేలవమైన  ఫామ్ ఎంతో మైనస్ గా మారిపోయింది. కోహ్లీ పేలవా ఫామ్ నేపథ్యంలో ఇక ప్రతి మ్యాచ్లో కూడా ఇతర ఆటగాళ్లు మాత్రమే జట్టును ముందుకు నడిపించాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఇటీవలే జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో టచ్ లోకి వచ్చినట్లు కనిపించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సిన రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు అని చెప్పాలీ. 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. బౌల్ట్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన విరాట్ కోహ్లీ ఆతర్వాత ఓవర్ లో ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి చివరికి వికెట్ కోల్పోవటంతో అభిమానులు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీగ్ మ్యాచ్ లలో ఓకే గాని చావో రేవో తేల్చుకోవాల్సిన క్వాలిఫైర్ రెండు మ్యాచ్ లలో కూడా ఇలాంటి ప్రదర్శన ఏంటి కోహ్లీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఒకవేళ కోహ్లీ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి పేలవమైన ఫామ్ కొనసాగిస్తూ అటు అంతర్జాతీయ క్రికెట్లో కూడా చోటు కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: