
రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓటమి ఎంతగానో నిరాశ కలిగించిందని తెలిపిన డుప్లేసెస్ ఇక ఈ ఏడాది సీజన్ లో మాత్రం తమ ఆటగాళ్లు ఎంతో బాగా ఆడారని మెచ్చుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 180 పరుగులు చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఈ సీజన్ బెంగళూరు జట్టుకు ఎంతో గొప్పది.. మా ఆట పట్ల గౌరవం గా ఉన్నాం. ఇక మేము ఎక్కడికి వెళ్లిన అభిమానుల మద్దతు మాత్రం ఎప్పుడూ ఉంటుంది.. మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక మా జట్టులో హర్షల్ పటేల్, దినేష్ కార్తిక్, రాజత్ పటిదర్ అంచనాలకు మించి రాణించారూ అంటు ప్రశంసలు కురిపించాడు. ఇక మరో మూడేళ్ళ వరకు ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. ఇందుకోసం ఎంతో కష్టపడతాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రాజస్థాన్ లాంటి మేటి జట్టు తో పోటీ పడ్డ ఆ జట్టు ఫైనల్లో ఉండేందుకు ఎక్కువ అర్హత కలిగి ఉంది అంటూ బెంగళూరు కెప్టెన్ డూప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక మరోవైపు భారత్లో క్రికెట్కు విశేషమైన ఆదరణ ఉందని తాము ఎక్కడికి వెళ్ళినా అభిమానుల మద్దతు ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.