ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా నాకౌట్ మ్యాచ్ లు ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల సెమీ ఫైనల్ మ్యాచ్ లు ముగియడంతో మరికొన్ని రోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ ఫైనల్ మ్యాచ్ ముంబై, మధ్య ప్రదేశ్ జట్ల మధ్య జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక మధ్యప్రదేశ్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. 23 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్ ఈ అరుదైన రికార్డును సాధించింది. రంజీ ట్రోఫీ లో దాదాపు 23 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్ జట్టు ఫైనల్లో అడుగు పెట్టడంతో అభిమానులను ఆనందంలో మునిగిపోయారు.


 ఇటీవలే రంజీవ్ టోర్నీలో భాగంగా సెమీఫైనల్లో పశ్చిమబెంగాల్ జట్టుతో మధ్యప్రదేశ్ జట్టు హోరాహోరీగా తలపడింది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా 174 పరుగుల తేడాతో బెంగాల్ జట్టుపై ఘన విజయాన్ని సాధించింది మధ్యప్రదేశ్. 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 96 పరుగుల స్కోరు తో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు తన రెండో ఇన్నింగ్స్లో 105 పరుగులకే కుప్పకూలింది. ఇక ఐదో రోజు వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత బెంగాల్ జట్టు 28.2 ఓవర్లలోనే మరో 79 పరుగులు జోడించింది.  ఇక అదే సమయంలో మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది.


 దీంతో టార్గెట్ చేధించలేక 174   పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది అని చెప్పాలి. ఇలా మధ్యప్రదేశ్ జట్టు ఇక 23 ఏళ్ల తర్వాత అటు రంజీ ఫైనల్లో అడుగుపెట్టి రికార్డు సృష్టించింది. దీంతో అభిమానులు అందరూ ఈ సారి రంజీ ట్రోఫీ మధ్యప్రదేశ్ గెలుస్తుందని బలంగా నమ్ముతున్నారు. అయితే 1998-99 సీజన్లో ఫైనల్ చేరింది మధ్యప్రదేశ్ జట్టు. కానీ తుది పోరులో కర్ణాటక చేతిలో 96 పరుగుల తేడాతో ఓడిపోయింది. నాడు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినప్పటికీ ఇక చివరికి డ్రాగా ముగించాలీ అని భావించింది మధ్యప్రదేశ్. కానీ బ్యాటింగ్ విభాగం  మొత్తం పేక మేడలా కూలిపోవటంతో చివరికి కర్ణాటకకు ఆరోజు విజయం వరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: