ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు దిగ్గజ జట్టుగా కొనసాగుతూ ఉంది అనే విషయం తెలిసిందే. ఎప్పుడు అత్యుత్తమ ఆటగాళ్లతో పటిష్టంగా కనబడుతూ ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టిస్తూ ఉంటుంది ఆస్ట్రేలియా.  అందుకే ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ అంటే చాలు అన్ని జట్లు కూడా తమ అత్యుత్తమమైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నం  చేస్తూ ఉంటాయి. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఈ వన్డే సిరీస్ లో భాగంగా అటు శ్రీలంక జట్టు అద్భుతంగా రాణిస్తోంది.


 ఈ క్రమంలోనే దిగ్గజ ఆస్ట్రేలియా జట్టుపై శ్రీలంక వరుసగా షాకుల ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవలే తొమ్మిదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై శ్రీలంక ఒక అరుదైన విజయాన్ని సాధించింది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో కూడా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది శ్రీలంక జట్టు. ఈ క్రమంలోనే 2013 తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక జట్టు వరుసగా రెండు వన్డే మ్యాచ్లలో గెలవడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇకపోతే ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా.


 ఈ క్రమంలోనే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఇక ఇందులో ఆరోన్ ఫించ్ 62 పరుగులు, హెడ్ 70 పరుగులతో రాణించారు. ఇక ఆ తర్వాత 292 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగింది శ్రీలంక జట్టు. ఈ క్రమంలోనే శ్రీలంక బ్యాట్స్మెన్ లు అద్భుతంగా రాణించారు అని చెప్పాలి. 48.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది శ్రీలంక. ఓపెనర్లు నిసాంక 137 పరుగులతో సెంచరీతో చెలరేగి పోయాడు. కుశాల్ మెండిస్ 87 పరుగులతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన ప్పటికీ  అప్పటికే జట్టు కోసం చేయాల్సినంత చేశాడు.  ఇక ఈ ఇద్దరూ బ్యాట్స్మెన్లు  కూడా  శ్రీలంక విజయంలో కీలక పాత్ర వహించారు అని చెప్పాలి. ఇక ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా శ్రీలంక జట్టు 2-1 తేడాతో ప్రస్తుతం ఆధిక్యంలోకి వచ్చేసింది. శ్రీలంక మరో విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: