సాధారణంగా అన్ని దేశాలలో క్రికెట్ అనేది ఒక ఆట మాత్రమే. కానీ భారత్లో మాత్రం క్రికెట్ అనేది ఆట కాదు ఏకంగా ఒక మతం అన్నట్లుగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా సినిమా హీరోలకు మించిన క్రేజ్ ను సంపాదించుకున్న క్రికెటర్లు అభిమానుల చేత అమితంగా ఆరాధించబడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక క్రికెటర్లను ఎంతగానో ఇష్టపడే అభిమానులు ఒక్కసారి క్రికెటర్లను కలిస్తే చాలు అని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కాస్త రిస్క్ అని తెలిసినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా సెక్యూరిటీని దాటుకుని మైదానంలోకి  దూసుకు వచ్చి తమ అభిమాన క్రికెటర్లను కలుస్తూ ఉంటారు.


తమ అభిమాన క్రికెటర్లు ఎక్కడ కనిపించినా కూడా వెంటనే వెళ్లి ఒక ఫోటో తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా అభిమానులు దగ్గరకు వచ్చిన సమయంలో క్రికెటర్లు కూడా ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక ఇలా అభిమానులు ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు క్రికెటర్లు కాస్త విసుక్కున్నారు అంటే చాలు అభిమానులు ఫీల్ అవ్వడమే కాదు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా ఎదుగుతున్న ఓపెనర్ రుతూరాజ్ గైక్వాడ్ పై కూడా ఇలాంటి విమర్శలు వస్తున్నాయని చెప్పాలి.



 ఇటీవలే బెంగుళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్లో అతడు ఒక వ్యక్తితో వ్యవహరించిన తీరు అందరికీ కోపం తెప్పిస్తుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డగౌట్ లో కూర్చున్నాడు. గ్రౌండ్ సిబ్బందిలో ఒకరు తమ అభిమాన క్రికెటర్ రూతురాజ్ తో ఒక ఫోటో తీసుకోవడానికి వెళ్లగా అతన్ని పక్కకు తోసేసాడు రూతురాజ్. కాస్త దూరంగా ఉండు అంటూ రూతురాజ్ అసహనం వ్యక్తం చేయడంతో అభిమానులు ఎంతగానో ఫీలయ్యారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారి పోవడం తో ఈ యువ బ్యాట్స్మెన్ తీరును తప్పుబడుతున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: