ఇటీవలి కాలం లో కరోనా వైరస్ నేపథ్యం లో ఇక క్రికెట్ మ్యాచ్ లను ఎలాంటి అవాంతరాలు ఆటంకాలు లేకుండా నిర్వహించడం  ఆయా దేశాల క్రికెట్ బోర్డులు పెద్ద సవాల్తో కూడు కున్నదిగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఆటగాళ్లను కఠిన మైన నిబంధనలు మధ్య కేవలం హోటల్ గదికి మాత్రమే పరిమితం చేస్తూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. ఇలా ఇటీవలి కాలం లో ప్రతీ మ్యాచ్ కూడా కఠిన నిబంధనల మధ్య జరుగుతుంది.


 కాని కొంత మంది ఆటగాళ్లు నిబంధనలు తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక ఇలా నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్ళ పట్ల ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా కాస్త కఠినం గానే వ్యవహరిస్తున్నాయి. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక పోతే ఇక ఇప్పుడు ఇదే రీతిలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టీమిండియాలో సీనియర్ లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు బిసిసిఐ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


 ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనకు బయలు దేరింది టీమిండియా జట్టు. అక్కడ ఒక టెస్ట్ తో పాటు టీ20 వన్డే సిరీస్ లను కూడా ఆడబోతుంది. అయితే ఇప్పటికే టీమిండియా లండన్ చేరుకోగా.. రెండు రోజుల కిందట రోహిత్ కోహ్లీ షాపింగ్ కోసం లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఇక అక్కడ అభిమానుల తో ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఆ సమయం లో ఎలాంటి మాస్కులు లేకుండా రోహిత్ కోహ్లీ ఫోటోలు దిగడం పై బిసిసిఐ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని లేని పక్షం లో చర్యలు తీసుకుంటామంటూ ఇద్దరు క్రికెటర్లకు బిసిసిఐ వార్నింగ్ ఇచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: