సాధారణంగా ఒక క్రికెటర్ ఓకే దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ తెలుసు. కానీ ఒక దేశం తరఫున ఆడిన ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించ కుండానే మరో దేశం తరపున ఆడేందుకు కూడా అవకాశం ఉంటుందని కొంతమంది క్రికెట్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఇలా ఇప్పటివరకు ఆడిన ఆటగాళ్ళు ఎంతో మంది ఉన్నారు అన్న విషయం తెరమీదికి వచ్చింది.  అయితే  ఇక ఈ విషయం తెర మీదికి రావడానికి కారణం ఇటీవలే నెదర్లాండ్స్ క్రికెటర్ రెండు దేశాల తరపున ప్రాతినిధ్యం వహించడమే. నెదర్లాండ్స్  క్రికెటర్ మైకెల్ రిప్పన్  మొన్నటి వరకు నెదర్లాండ్స్ తరఫున ఆడాడు.  కానీ ఇప్పుడు న్యూజిలాండ్ తరపున ఆడేందుకు సిద్దం అవుతున్నాడు. దీంతో ఈ విషయం తెలిసి ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన మైకెల్ రిప్పన్ కుటుంబసభ్యులు 2013లో న్యూజిలాండ్ కి వలసవచ్చారు. ఈ క్రమంలో న్యూజిలాండ్  క్రికెట్ లో ఓనమాలు నేర్చుకున్నాడు మైకెల్ రిప్పన్. తర్వాత డచ్ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్  జట్టుకు 9వన్డేలు  21 టి20 లకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఇప్పుడు మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు మైకెల్ రిప్పన్.


 అయితే ఇప్పటి వరకు ఇలా అంతర్జాతీయ క్రికెట్ లో రెండు దేశాల తరపున ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఒకడు. ఐర్లాండ్,  ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఇయాన్ మోర్గాన్ తో పాటు  లూక్‌ రోంచి( న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా), మార్క్‌ చాప్‌మన్‌(హాంకాంగ్‌, న్యూజిలాండ్‌), గ్జేవియర్‌ మార్షల్‌(అమెరికా, వెస్టిండీస్‌),హెడెన్‌ వాల్ష్‌(అమెరికా, వెస్టిండీస్‌), డేవిడ్‌ వీస్‌(సౌతాఫ్రికా, నమీబియా)లు ఈ లిస్టులో ఉన్నారు. కాగా ఐసిసి నిబంధనల మేరకు ఏదైనా సభ్య దేశానికి  ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు  పూర్తిస్థాయి జట్టు తరఫున  అవకాశం ఉంది. ఒకవేళ పూర్తిస్థాయి జట్టుకు ఎంపికైతే మూడేళ్లపాటు అసోసియేట్ దేశాలకు దూరంగానే ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: