టీమిండియాలో కీలక బౌలర్గా ప్రస్థానం కొనసాగిస్తున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే కరోనా వైరస్ బారిన పడటం సంచలనంగా మారిపోయింది. అయితే అందరూ ఆటగాళ్లతో కలిసి అటు రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సి ఉంది. అక్కడ ఇంగ్లాండ్తో జరగబోయే ఒక టెస్ట్ మ్యాచ్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇక ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరడానికి ముందు రవిచంద్రన్ అశ్విన్ వైరస్ బారిన పడటంతో జట్టు సభ్యులతో బయల్దేరకుండా ఇండియాలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే అశ్విన్ త్వరగా కరోనా వైరస్ నుంచి కోలుకోవాలి అని అభిమానులు అందరూ కూడా ఆకాంక్షించారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా వైరస్ బారి నుంచి బయటపడ్డాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఇక ఇంగ్లాండ్తో టెస్టు మ్యాచ్ ఆడేందుకు లండన్ బయలుదేరబోతున్నాడని సమాచారం.  కాగా నేడు లండన్ ఫ్లైట్ ఎక్కడున్నాడని  టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ఆర్ టి పి సి ఆర్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన అశ్విన్ కు ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత కూడా మరోసారి ఆర్ టి పి సి ఆర్ చేయబోతున్నారట. ఈ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాతే రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాతో కలుస్తాడు.


 ఈ క్రమంలోనే ఈ నెల 24వ తేదీన జరగబోయే ప్రాక్టీస్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా తో కలిసి పాల్గొనే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. అయితే ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ అదరగొట్టేశాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత తమిళనాడు క్రికెట్ సంఘం నిర్వహించిన స్థానిక లీగ్ లో పాల్గొని చివరికి వైరస్ బారిన పడ్డాడు అశ్విన్. కాగా జూలై 1వ తేదీ నుంచి ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగే రి షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ టెస్ట్ లో భాగంగా 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇండియా. ఇక ఇప్పుడు చివరి టెస్టులో కూడా గెలవాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: