ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతోంది హర్మన్ ప్రీత్ కౌర్. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ గా మాత్రమే కాదు ఒక గొప్ప ప్లేయర్ గా జట్టుకు విజయ తీరాల వైపు నడిపించే కీలక బ్యాటర్ గా కూడా హర్మన్ ప్రీత్ కౌర్ కి ప్రత్యేకమైన గుర్తింపు. ఇకపోతే ఇప్పటివరకు తన బ్యాటింగ్ లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పుడు మరికొన్ని రికార్డులను కూడా కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది అని తెలుస్తోంది. శ్రీలంక జట్టుతో నేటి నుంచి ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా హర్మన్ ప్రీత్ కౌర్ ముందు ఒక ఆసక్తికర రికార్డు ఊరిస్తోంది.


 టి 20 క్రికెట్ లో మరో 45 పరుగులు సాధించింది అంటే చాలు ఇక టి20 ఫార్మాట్ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించబోతుంది హర్మన్ ప్రీత్ కౌర్. ఇప్పుడు వరకు 121 టి20 లలో 103 స్ట్రైక్ రేట్తో 2319 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఇటు శ్రీలంకతో సిరీస్లో భాగంగా మరో 45 పరుగులు చేస్తే మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ పేరిట ఉన్న అత్యధిక టి20 పరుగుల రికార్డును అధిగమిస్తుంది. ఇప్పటివరకు మిథాలీ రాజ్ 2364 పరుగులు చేసింది. 89 మ్యాచ్ లలోనే 17 అర్థ సెంచరీలు సహాయంతో 2364 పరుగులు సాధించడం గమనార్హం.


 అయితే ఇప్పుడు హార్మోన్ ప్రీత్ కౌర్ మాత్రం ఏకంగా 121 టి20 మ్యాచ్ లలో ఒక సెంచరీ 6 అర్థ సెంచరీలు సహాయంతో 2319 పరుగులు చేయగా.. ఇక మిథాలీ రాజ్ రికార్డుని బద్దలు కొట్టెందుకు 45 పరుగుల దూరంలో ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక శ్రీలంక పర్యటనలో తప్పకుండా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు సాధించి తీరుతుందని అటు అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత మహిళా జట్టు శ్రీలంక పర్యటనలో మూడు టి20 లు, మూడు వన్డేలు ఆడపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: