ఇటీవలే గజ్జల్లో గాయం కారణంగా సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో టి20 సిరీస్ దూరమయ్యాడు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న కారణంగా టీమిండియా ఆడబోయే టెస్ట్ మ్యాచ్ కి కూడా కె.ఎల్.రాహుల్ దూరం కాబోతున్నాడు అని తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న కె.ఎల్.రాహుల్ భారత జట్టుకు దూరమవడం మాత్రం ఎంతగానో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై మాజీ క్రికెటర్ మాజీ సెలెక్టర్ సబా కరీం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.


 గత ఏడాది ఇంగ్లండ్ గడ్డపై కె.ఎల్.రాహుల్ మంచి ప్రదర్శనతో భారీ స్కోర్ చేశాడు అంటూ కె.ఎల్.రాహుల్  పై ప్రశంసలు కురిపించాడు. కానీ ఇప్పుడు అలాంటి మేటి ఆటగాడు జట్టుకు దూరం కావడం మాత్రం టీమిండియాకు  తీరనిలోటు అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం టీమిండియా జట్టులో కె.ఎల్.రాహుల్ లేడు కాబట్టి ఓపెనర్ రోహిత్ శర్మ పై మరింత బాధ్యత పెరుగుతుంది. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ మ్యాచ్ లో  టీమిండియా గెలుపులో కేఎల్ రాహుల్ తన వంతు సహాయం చేశాడు. అందుకే ఇప్పుడు టీమిండియా అతని సేవలను తప్పకుండా మిస్ అవుతుంది అని  అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 గాయం కారణంగా జట్టు దూరం కావడంతో ప్రస్తుతం కేఎల్ రాహుల్ స్థానంలో శుభమాన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. గత ఏడాదికి కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ  భారత్ కు శుభారంభం ఇచ్చాడు రోహిత్ శర్మ ఇక ఇప్పుడు కూడా అదే స్థాయిలో రాణించాలీ. ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు బ్యాట్ ఝాలిపిస్తే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది అంటూ సబా కరీం చెప్పుకొచ్చాడు. అయితే గత ఏడాది కరోనా వైరస్ కారణంగా రద్దైనా 5వ మ్యాచ్ ను జులై 1వ తేదీన రీ షెడ్యూల్ చేశారు. అయితే ఇప్పటికే ఈ టెస్టు సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది టీమిండియా. దీంతో టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన లేదా డ్రాగా ముగిసిన కూడా ఇండియా కు సిరీస్ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: