ఇటీవల సొంత గడ్డపై సౌతాఫ్రికాతో టి20 సిరీస్ ఆడింది భారత జట్టు. ఈ టి 20 సిరీస్ లో భాగంగా  భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు యువ ఆటగాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే కెప్టెన్సీలో ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక రిషబ్ పంత్ కెప్టెన్సీపై గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ రిషబ్ పంత్ కి   టీమిండియా కెప్టెన్సీఅప్పగించి ఉండాల్సింది కాదు.. బిసిసిఐ తప్పుడు నిర్ణయం తీసుకుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 కారణం  రిషబ్ పంత్ ఒకవైపు జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించే లేకపోవడమే కాదు ఒక ఆటగాడిగా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తంగా నాలుగు టి20 మ్యాచ్ లలో కలిపి కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్. దీన్ని బట్టి అతను ఎంత చెత్త ప్రదర్శన చేశాడు అన్నది అర్థం చేసుకోవచ్చు. చివరికి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో  సిరీస్ 2-2 తో సమమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  రిషబ్ పంత్ కు కెప్టెన్సీ అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు మాజీ ఆటగాడు మదన్ లాల్.


 తానే గనుక  సెలక్షన్ కమిటీలో ఉంటే 24 ఏళ్ళ యువ ఆటగాడిని టీమిండియా సారథి గా ఎంపిక చేసే వాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒక ఆటగాడిగా రిషబ్ పంత్ మరింత మెరుగుపడాల్సి ఉందని పూర్తిస్థాయిలో పరిణితి చెందిన తర్వాతే రిషబ్ పంత్ కెప్టెన్సీ భారాన్ని మోయగలుగుతాడు అంటూ మదన్ లాల్ వ్యాఖ్యానించాడు. తనకు అధికారం ఉండి ఉంటే  తప్పకుండా అతను కెప్టెన్సీ చేపట్టకుండా అడ్డుకునే వాడిని..  ఒక బ్యాట్స్మన్గా  రిషబ్ పంత్ సేవలు జట్టుకు అవసరమైన సమయంలో అంతకు మించిన పెద్ద పెద్ద బాధ్యతలు అతని పై మోపటం సరికాదు. టీమిండియా కెప్టెన్సీ మామూలు విషయం కాదు అంటూ మదన్లాల్ చెప్పుకొచ్చాడు. గతంలో ధోని కూల్ గా కోహ్లీ దూకుడుగా కెప్టెన్సీకి న్యాయం చేశారు అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: