పాకిస్తాన్లో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్ ఇక ఇటీవలే తన ఐదేళ్ల కొడుకు బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెటర్లు కొన్ని కొన్ని సార్లు తమ కుటుంబ సభ్యులతో సరదాగా క్రికెట్ ఆడడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక తమ పిల్లలతో క్రికెట్ ఆడుతూ వారి ఆనందం కోసం క్లీన్ బౌల్డ్ అవడం లాంటివి కూడా చేస్తుంటారు. ఇలాంటివి చేసి ఎంతగానో సంతోష పడి పోతూ ఉంటారు. ఇక ఇప్పుడు పాకిస్థాన్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఇలాంటిదే చేశాడు అన్నది తెలుస్తుంది. ఏకంగా తన ఐదేళ్ల కొడుకు తో కలిసి గల్లీ క్రికెట్ లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ చేయగా కొడుకు బౌలింగ్ చేశాడు.


 ఇక సర్ఫరాజ్ అహ్మద్  కొడుకు ఒక యార్కర్ సందించడంతో చివరికి ఈ స్టార్ క్రికెటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఒక్క సారిగా షాక్ అయిన సర్ఫరాజ్ వెంటనే తన కొడుకు వైపు చూసి చిన్న చిరునవ్వు చిందించాడు. అయితే స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ కొడుకు అబ్దుల్లా ఇప్పటికే లోకల్ క్రికెట్ అకాడమీలో మంచి క్రికెటర్ గా రూపు దిద్దుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే గతంలో ఇక్కడ రాజకీయాలతో విసిగిపోయాను. తన కొడుకును  ఎట్టి పరిస్థితుల్లో క్రికెటర్ కానివ్వను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సర్ఫరాజ్ అహ్మద్. ఇక ఇప్పుడు తనను క్లీన్ బౌల్డ్ చేసిన తన కుమారుడిని స్టార్ క్రికెటర్ గా మారుస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే వికెట్ కీపర్ అయిన సర్ఫరాజ్ అహ్మద్ మంచి బ్యాట్స్ మెన్ కూడా అన్న విషయం తెలిసిందే.  కానీ అతనికి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఎందుకో సరైన అవకాశాలు మాత్రం రాలేదు. దీనికి కారణం అప్పటికే పాకిస్తాన్ క్రికెట్ లో యంగ్ ప్లేయర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ రిజ్వాన్ అందుబాటులో ఉండటం గమనార్హం. ఇటీవలి కాలంలో మహమ్మద్ రిజ్వాన్ అన్ని ఫార్మాట్లలో కూడా కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. దీంతో ఇప్పటికే వయసు పెరిగి పోయిన సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అవకాశాలు సన్నగిల్లుతున్నాయి అని చెప్పాలి. కాగా సర్పరాజ్ అహ్మద్ పాకిస్థాన్కు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: