ఇపుడు క్రికెట్ అభిమానుల చూపులన్నీ జులై 1న జరిగే మ్యాచ్ పైనే వున్నాయి. ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు నెగ్గి, టీమిండియా చరిత్ర సృష్టించాలంటూ క్రికెట్‌ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. 2007లో రాహుల్‌ ద్రవిడ్‌ సారధ్యంలో ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియా చివరిసారి టెస్టు సిరీస్‌ గెలిచిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత 2011, 2014, 2018 సంవత్సరాల్లో అది కలగానే మిగిలిపోవడం దురదృష్టకరం. ఆ తర్వాత 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో పక్కాగా సిరీస్‌ నెగ్గుతామంటూ అంతా భావించారు. అయితే, ఆ సిరీస్‌లో నిర్ణయాత్మక ఆఖరి టెస్టు వాయిదా పడిన విషయం తెలిసిందే.
 
ఎడ్జ్‌ బాస్టన్‌ వేదికగా జరగబోయే 5వ టెస్టును టీమిండియా గెలిచినా, డ్రాగా ముగించినా కూడా చరిత్ర సృష్టించినట్లౌతుంది అని భావిస్తున్నారు. కెప్టెన్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ సాధించింది.. హెడ్‌ కోచ్‌గా సాధించగలడా? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే విజయం/డ్రా ఈ రెండూ టీమిండియాకు అంత సులువుగా దక్కే అవకాశం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టులో భయానక బ్యాట్స్ మెన్స్ వున్నారు. బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, జో రూట్‌, బెయిర్‌స్టో మంచి ఫామ్‌లో ఉన్నారు.
 
ఇక జో రూట్‌ ప్రస్తుతం ఎంతో నిలకడగా, అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థులు ఎవరైనా సరే అంత తేలిగ్గా వికెట్‌ ఇవ్వడంలేదు. ముప్పు తిప్పలు పెట్టి, శతకాలు బాదేస్తున్నాడు. అటు టీమిండియా మీద కూడా రూట్‌ చాలా మంచి రికార్డులు ఉన్నాయి. 5వ టెస్టు జరగబోయే ఎడ్జ్‌ బాస్టన్‌ మైదానంలోనూ భారత్‌ తో ఆడిన 2 ఇన్నింగ్సుల్లో 94 పరుగులు చేశాడు. అటు బెయిర్‌స్టో కూడా ఎంతో ప్రమాదకర ఆటగాడు. టెస్టు మ్యాచ్‌ టీ20 తరహాలో అదే సత్తా ఉన్నోడు. అంతేకాకుండా టీమ్‌ ను ముందుండి గెలిపిస్తాడు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: