రంజి  ట్రోఫీ 2022 లో భాగంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే దాదాపు ఇరవై మూడేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఫైనల్లోకి అడుగుపెట్టింది మధ్యప్రదేశ్ జట్టు. గతంలో ఫైనల్ లోకి అడుగు పెట్టిన కేవలం రన్నరప్ గా మాత్రమే సరిపెట్టుకుంది.  ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రంజీ ట్రోఫీ విజేతగా నిలవాలని భావిస్తోంది మధ్యప్రదేశ్ జట్టు.  కాగా రంజీ క్రికెట్ చరిత్రలో 47 వ సారి ఫైనల్లోకి అడుగుపెట్టింది దిగ్గజ ముంబై జట్టు.


 ఈ క్రమంలోనే ఇక 42 వ సారి రంజీ ట్రోఫీ అందుకోవాలని ఆశతో ఉంది. ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం రంజి ఫైనల్ పోరు మరింత ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం రసవత్తరంగా జరుగుతున్న మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతుంది  అన్నది మాత్రం తెలుస్తోంది. ముంబై తొలి ఇన్నింగ్స్ లో 374 పరుగులకు ఆలౌట్ కాగా మధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 535 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మధ్యప్రదేశ్లోని ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగుల ఆధిక్యం లభించింది.


 ఇక తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించడం ద్వారా మధ్యప్రదేశ్ జట్టు తొలిసారిగా ఛాంపియన్ గా అవతరించనుందని తెలుస్తోంది. అయితే ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ చూసేందుకు స్టేడియం లోకి వచ్చాడు సీఎస్కే ఆటగాడు దీపక్ చాహర్. అయితే అతన్ని స్క్రీన్ మీద చూడగానే అభిమానులు అందరూ కూడా సీఎస్కే.. సీఎస్కే అంటూ గట్టిగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో దీపక్ చాహర్ కూడా చిరునవ్వుతో
 ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: