సాధారణంగా జట్టును మరింత పటిష్టవంతంగా మార్చాలి అంటే అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉండాలి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ జట్టు పటిష్టంగా మార్చుకునేందుకు ఎప్పుడూ సారధులు  కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలా ప్రయోగాలు చేయడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ ముందుంటారు అని చెప్పాలి. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వారికి సరైన అవకాశాలు ఇచ్చి వారి ప్రతిభను వెలికి తీసి టీమిండియాను పటిష్టంగా మార్చుకోవడంలో రోహిత్ శర్మ ప్రత్యేకమైన వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉంటాడు.


 ఇలా ఇప్పటికే ముంబై ఇండియన్స్ తరఫున ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇలా రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే జస్ప్రిత్ బూమ్రా హార్దిక్ పాండ్యా ఇక మొన్నటికి మొన్న తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ లాంటి యువ ఆటగాళ్లు తెర మీదికి వచ్చారు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది భారత జట్టు. ఈ క్రమంలోనే లిస్టర్ షైర్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.  ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ పై  రోహిత్ శర్మ ఒక ప్రయోగం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 70 పరుగులతో అజేయంగా నిలిచిన అతన్ని రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ గా పంపించాడు రోహిత్ శర్మ.  ఏకంగా తన స్థానాన్ని త్యాగం చేసి ఓపెనర్గా అవకాశం ఇచ్చాడు.


 ఇలా ఓపెనర్గా వచ్చిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ వచ్చిన అవకాశాన్ని ఎంతోబాగా సద్వినియోగం చేసుకున్నాడు. కొత్త బంతిని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 48 పరుగులు చేసి తనలో ఓపెనింగ్ చేయగల సత్తా దాగి ఉంది అని టీమిండియా మేనేజ్మెంట్ కు తన బ్యాటింగ్తో చెప్పకనే చెప్పాడు. ఫలితంగా ఇక శుభమన్ గిల్ కి ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పేలా లేవు అని తెలుస్తోంది. అతడు ఫామ్ లో లేకపోతే  అతని స్థానంలో శ్రీకర్ భరత్ ని భర్తీ చేసే అవకాశం ఉంది అని కొంతమంది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: