ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి మాత్రం సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీ ఆట తీరుపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయంలోనే బీసీసీఐ ఇటీవలే విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే  కుటుంబంతో కలిసి ఎంతగానో ఎంజాయ్ చేసిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు ఇంగ్లండ్తో టీమిండియా ఆడబోయే టెస్ట్ మ్యాచ్లో బాగా రాణించేందుకు సిద్ధమయ్యాడు. ఇక కోహ్లీ ప్రదర్శనపై ప్రస్తుతం భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి.

 కాగా గత ఏడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐదవ టెస్ట్ మ్యాచ్ రీ షెడ్యూల్ చేసి జూలై 1వ తేదీ నుంచి నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇక ఇప్పటికే ఈ టెస్టు సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది టీమిండియా. దీంతో ఇంగ్లాండ్ పై విజయం సాధించినా లేదా మ్యాచ్ డ్రాగా ముగిసిన టీమిండియాకు సిరీస్ సొంతం అవుతుంది. కాగా ప్రస్తుతం లిస్టర్ షైర్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా టీమిండియా.. ఇక ఈ మ్యాచ్లో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ సాధించడం గమనార్హం. మూడో రోజు ఆటలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు విరాట్ కోహ్లీ.


 ఈ క్రమంలోనే 98 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ  5 ఫోర్లు రెండు సిక్సర్లతో 67 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఈ వార్మప్ మ్యాచ్లో సెంచరీ చేశాడు అని అందరూ అనుకున్నారు. కోహ్లీ ఎంతో స్వేచ్చగా షాట్లు ఆడుతూ ఉండటంపై అభిమానులందరూ మురిసిపోయారు. కానీ అంతలోనే విరాట్ కోహ్లీ జస్ప్రిత్ బూమ్రా ఉచ్చులో చిక్కుకున్నాడు. బుమ్రా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు విరాట్ కోహ్లీ. ఇలా బుమ్రా కారణంగా కోహ్లీ అభిమానులకు సెంచరీఆశ తీరలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: