టి 20 క్రికెట్ అంటేనే బ్యాట్స్మెన్స్ విధ్వంసానికి మారుపేరు అనే విషయం తెలిసిందే. క్రీజు లోకి వచ్చే బ్యాట్స్మెన్లు అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తు బౌలర్లతో చెడుగుడు ఆడేస్తూ వుంటారు. ఇలా బ్యాట్స్మెన్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉండడం క్రికెట్ ప్రేక్షకులందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇక పొట్టి ఫార్మాట్లోనూ ఎవరైనా ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడితే దాని గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం చేర్చుకుంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు ఇలాంటి ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. బ్యాటింగ్ విధ్వంసం అంటే ఏంటో ఒక రేంజిలో చూపించాడు ఇక్కడ ఒక ఆటగాడు. జట్టులోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి బంతిని ఉతికి ఆరేస్తూ వచ్చాడు. కేవలం 17 బంతుల్లోనే 76 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు ఇంగ్లాండ్ ఆటగాడు ఆడం హోస్. టీ20 బ్లాస్ట్ లో భాగంగా ఈ అద్భుతమైన ప్రదర్శన చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఇంగ్లండ్ వేదికగా టీ20 బ్లాస్ట్ లో మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.


 ఇటీవలే టీ20 బ్లాస్ట్ లో భాగంగా వొర్సెస్టర్ షైర్, బర్మింగ్హామ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన బర్మింగ్హామ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇక ప్రత్యర్థి జట్టు 84 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో బర్మింగ్హామ్ 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట్లోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది బర్మింగ్హామ్ జట్టు. ఆ సమయంలోనే క్రీజులోకి వచ్చాడు ఆడం హోస్.  17 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇక మొత్తంగా 53 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగానే బర్మింగ్హామ్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: