రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు యువ భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరింది అన్న విషయం తెలిసిందే. ఇక ఐర్లాండ్  పర్యటనలో ఇప్పటికే ప్రాక్టీస్ ముగించుకున్న టీమిండియా  ఇక నేటి నుంచి టి20 సిరీస్ ఆడ పోతుంది అని చెప్పాలి. డబ్లిన్ వేదికగా ఇక మొదటి టి20 మ్యాచ్ జరగబోతోంది. అయితే ఇక ఐపీఎల్ లో అదరగొట్టిన ఎంతో మంది యువ ఆటగాళ్లు భారత జట్టు తరఫున అవకాశం దక్కించుకున్నారు. వీరిలో రాహుల్ త్రిపాఠి కూడా ఒకరు అనే విషయం తెలిసిందే.


 ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 14 మ్యాచుల్లో నాలుగు వందల 13 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక ఈ ప్రదర్శన తర్వాత సెలెక్టర్లు అతన్ని ఐర్లాండ్  పర్యటనకు ఎంపిక చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక రాహుల్ త్రిపాఠి గురించి స్పందించిన మాజీ హెడ్ కోచ్ రావిశాస్త్రి అతని పై ప్రశంసలు కురిపించాడు. రాహుల్ త్రిపాటి  క్రీజులో ఉన్నాడు అంటే చాలు స్కోరుబోర్డుకు రెక్కలు వచ్చినట్లు గా ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. అతడు బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్ కొట్టడం లో నిష్ణాతుడు.. ఇక భారీ షాట్లు ఆడగల సత్తా  అతనిలో ఉంది.


 అంతేకాకుండా మైదానంలో అన్ని వైపులా 360 డిగ్రీస్ షాట్స్ కూడా అతను ఆడగలడు అంటూ రవి శాస్త్రి ప్రశంసలు కురిపించాడు అనే చెప్పాలి. ఇక ప్రత్యర్థి జట్టుకు కానీ బౌలర్లకు కానీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా విరుచుకుపడుతూ ఉంటాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అతడు సృష్టించే విధ్వంసం ఒక రేంజ్ లో ఉంటుంది. అతను ఆడుతూ ఉంటే కళ్లార్పకుండా చూడాలని అనిపిస్తూ ఉంటుంది అంటూ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. కాగా ఐర్లాండ్ టూర్ లో అవకాశం దక్కడం  గొప్ప అవకాశం.. ఇన్నాళ్ల కల నిజమైంది.  ఇక శాయశక్తులా టీమిండియా కోసం కృషి చేస్తాను అంటూ రాహుల్ త్రిపాటి   చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: