భారత క్రికెట్ లో ఒక్కసారిగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత కనుమరుగైనా క్రికెటర్లలో మురళీ విజయ్ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే. ఇండియాలో అవకాశాలు రాకపోవడంతో ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్కు దూరం గానే ఉన్నాడు. ఇప్పుడు రెండు ఏళ్ల బ్రేక్ తర్వాత టీమిండియా బ్యాట్స్మెన్ మురళీ విజయ్ మళ్లీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.. కానీ రీ ఎంట్రీ లో  లో కూడా పూర్తిగా నిరాశపరిచాడు అనే చెప్పాలి. ప్రస్తుతం రహీం షా కెప్టెన్గా ఉన్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆరో సీజన్లో విజయ్ రూబీ ట్రిచి వారియర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే పునరాగమనం చేసిన తర్వాత మంచి ప్రదర్శన చేస్తాడు అని అందరూ అనుకున్నారు.


 కానీ అతనికి క్రికెట్ లోకి రీఎంట్రీ అస్సలు కలిసి రాలేదు అన్న విధంగానే కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఆ తర్వాత రనౌట్ రూపంలో వికెట్ కోల్పోవడం గమనార్హం. దీంతో ఆ తర్వాత రోజుల్లో అతనికి అవకాశాలు దక్కుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మురళీ విజయ్ ఇంతకుముందు 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నట్లు కనిపించింది.  కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం పొట్టి క్రికెట్ కు పూర్తిగా దూరం అయిపోయాడు.


 ఈ క్రమంలోనే ఇన్నాళ్లు విరామం తీసుకోవడం పై మాట్లాడిన మురళి విజయ్..  తనకు చాలా కాలం పాటు క్రికెట్ ఆడాలని ఉందని.. కేవలం వ్యక్తిగత విరామం తీసుకున్నాను అంటూ తెలిపాడు. నాకు కుటుంబం ఉంది.వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఇప్పుడు నా క్రికెట్ను ఆస్వాదిస్తున్నాను ఇక ఫిట్ గా కూడా ఉన్నాను. ఇక ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో రాణిస్తానని నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మురళి విజయ్ అంతర్జాతీయ రికార్డులు చూసుకుంటే.. 38 ఏళ్ల మురళీ విజయ్ 61 టెస్టు మ్యాచ్‌ లలో 3982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయ్. టీమ్ ఇండియా తరఫున  17 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లకు వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: