ప్రస్తుతం బిసిసీఐ అధికారుల దృష్టి మొత్తం అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ పై ఉంది అన్న విషయం తెలిసిందే.  వరల్డ్ కప్ కోసం అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో ఉన్నారు సెలెక్టర్లు. ఈ క్రమంలోనే సీనియర్ల ప్రదర్శన పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగానే ఐపీఎల్లో రాణించిన యువ ఆటగాళ్లకు ఐర్లాండ్, సౌత్ ఆఫ్రికా తో ఆడిన సీరీస్ లలో అవకాశం ఇచ్చారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో టీమ్ ఇండియా తరఫున టి20 వరల్డ్ కప్ జట్టులో ఎవరు ఉంటారు అన్న దానిపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే ఇక ప్రస్తుతం ప్రపంచకప్ లో జట్టు ప్రణాళికలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమి లేడు అనేది తెలుస్తుంది. టి20 ఫార్మాట్కు మహమ్మద్ షమీ సరిపోడని సెలెక్టర్లు భావిస్తున్నారట. అతని స్థానంలో యువ బౌలర్లకు  అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను టి20 ప్రపంచకప్కు ఎంపిక కాకపోవచ్చు అనే ఊహాగానాలు కూడా తెరమీదకు వస్తున్నాయి.

 మొహమ్మద్ షమీ లేకపోయినప్పటికీ భువనేశ్వర్ కుమార్ జస్ప్రిత్ బూమ్రా ప్రపంచకప్ జట్టులో ఉంటారని అర్థమవుతుంది. ఇకపోతే చివరిసారిగా టీమిండియా తరఫున గత ఏడాది 20 ప్రపంచకప్ లో నమీబియా పై ఆడాడు మహమ్మద్ షమి. తర్వాత నేరుగా భారత టి20 లీగ్ లోనే పోటీ పడ్డాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఈ సీజన్లో 16 మ్యాచ్ లలో ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లే లో డెత్ ఓవర్లలో కీలక వికెట్లు తీశాడు. ఇకపోతే టి20 ప్రపంచ కప్ లో షమి ఉండకపోవచ్చు అని ఊహాగానాల నేపథ్యంలో అభిమానులు అందరూ కూడా  ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: