గత కొంత కాలంగా ఇంగ్లాండ్ వన్ డే మరియు టీ జట్లను అద్భుతంగా నడిపించి 2019 లో వన్ డే వరల్డ్ కప్ అందించి చరిత్ర పుటల్లోకెక్కాడు ఇయన్ మోర్గాన్. ఇతని కెప్టెన్సీలో జట్టు చాలా సిరీస్ లను గెలుచుకుంది. కానీ గత సంవత్సర కాలంగా ఎందుకో మోర్గాన్ ఫిట్నెస్ పరంగా మరియు ఫామ్ పరంగా విఫలం అవుతూ వచ్చాడు. ఆఖరికి దేశవాళీ టోర్నీలలలో సైతం సరైన ప్రదర్శన చేయలేకపోవడంతో ఇక జట్టుకు భారం కాకూడదని భావించి ఇటీవల రిటైర్మెంట్ ను తీసుకున్నాడు. దీనితో ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్సీ స్థానం ఖాళీ అయింది.

అయితే ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా బెన్ స్టోక్స్ ఎలాగో ఉన్నాడు. అతనిపై అదనపు భారం పెట్టడానికి యాజమాన్యం సిద్ధంగా లేదు. అందుకే ఇంతకు ముందు మోర్గాన్ గైర్హాజరీలో జట్టును నడిపించిన కీపర్ మరియు బ్యాట్స్మన్ అయిన జాస్ బట్లర్ ను కెప్టెన్ గా నియమిస్తూ కాసేపటి క్రితమే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని పట్ల బట్లర్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మోర్గాన్ నాయకత్వంలో టీం ఎన్నో శిఖరాలను చేరుకుందని.. ఒక ప్లేయర్ గా మోర్గాన్ నుండి చాలా నేర్చుకున్నానని... నాకు సాధ్యం అయినంతవరకు జట్టుకు విజయాలను అందించడానికి కృషి చేస్తానని బట్లర్ తెలిపాడు.  

గత రెండు రోజులుగా క్రికెట్ ప్రేమికులు తరువాత కాబోయే ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ ఎవరా అని ఎంతగానో ఎదురుచూశారు. వారి ఊహలకు అనుగుణంగానే క్రికెట్ లో అరవీర భయంకరుడు బాల్ పడితే సిక్సర్ లను అలవోకగా సంధించే ఆటగాడు బట్లర్ ను కెప్టెన్ గా ఎంచుకుంది. మరి పూర్తి స్థాయి కెప్టెన్ గా బట్లర్ కు ఇండియా తో జరగనున్న టీ 20 మరియు వన్ డే సిరీస్ మొదటి అగ్నిపరీక్షగా నిలవనుంది. మోర్గాన్ వారసుడిగా నమ్మకానని నిలబెట్టుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: