ఇటీవలే ఇంగ్లాండ్ జట్టుకు పరిమిత ఓవర్ల కెప్టెన్గా ప్రపంచ కప్ గెలిచిన వీరుడిగా కొనసాగిన ఇయాన్ మోర్గాన్ తన  అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీలో ఆడిన ఎంతో మంది ఆటగాళ్లు అతని కెప్టెన్సీ సామర్థ్యం గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్ వెటరన్ స్పిన్నర్ మొయిన్ అలీ సైతం ప్రశంసలు కురిపించాడు. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తో ఇయాన్ మోర్గాన్ ని పోల్చాడు మోయిన్ అలీ. మహేంద్ర సింగ్ ధోనీ, ఇయాన్ మోర్గాన్ మధ్య పెద్ద తేడాలు లేవని ఇద్దరు కూడా కూల్ అండ్ కామ్ మైండ్ సెట్ తో మైదానంలో ఒత్తిడిని ఎదుర్కొంటారని చెప్పుకొచ్చాడు మొయిన్ అలీ.


 కాగా ఇంగ్లాండ్ జట్టు తరఫున అటు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఆడిన మోయిన్ అలీ అటు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొయిన్ అలీ మాట్లాడుతూ నేను ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో ఆడాను. ఐపీఎల్లో ధోనీ నాయకత్వంలో కూడా ఆడాను. అయితే వీరిద్దరి మధ్య పెద్దగా తేడాలు ఉండవు. ఇద్దరి స్వభావం కూడా ఒకేలాగ ఉంటుంది. ప్రశాంతంగా ఉంటూ ఒత్తిడిని ఎదుర్కొంటు పని కానిచ్చేస్తారు. వీరిద్దరూ ఎంత అద్భుతమైన కెప్టెన్ లో అంతకుమించి అద్భుతమైన ఆటగాళ్లు అంటూ మొయిన్ అలీ ప్రశంసలు కురిపించాడు.


 ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ దృక్పధాన్ని మొత్తం పూర్తిగా మార్చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే చీకటి రోజుల్లో మగ్గిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ ను వెలుగులోకి తీసుకు వచ్చాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు లో ఆడుతున్న ఎంతోమంది ఆటగాళ్లపై కూడా ఈ ప్రభావం ఎంతగానో ఉంది. ఇక ప్రస్తుతం టెస్టులలో ఇంగ్లాండ్ రాణిస్తుంది అంటే దానికి ఇయాన్ మోర్గాన్ కారణం. ఆటగాళ్లందరూ మైండ్ సెట్ ను మార్చి ఇంగ్లాండ్ జట్టుకు కొత్త రూపు ఇచ్చాడు. పరిమిత ఓవర్లలో ఇంగ్లాండ్ తరఫున ఉన్న కెప్టెన్స్ అందరికంటే  అతను గొప్పవాడు అంటూ మొయిన్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: