ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా ఆతిథ్య  ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది  అనే విషయం తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఎందుకంటే టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కాకుండా అనూహ్యంగా జస్ప్రిత్ బూమ్రా చేతికి కెప్టెన్సీ బాధ్యతలు వచ్చాయనే విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కపిల్ దేవ్ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ అందుకున్న ఏకైక ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. కాగా బుమ్రా కెప్టెన్సీపై ఎంతో మంది మాజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఇదే విషయంపై ఇటీవలే ముంబై ఇండియన్స్ కోచ్ గా వ్యవహరిస్తున్న మహేళ జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 ఇటీవలే బుమ్రా భార్య సంజన గణేశన్ తో ఐసీసీ నిర్వహించిన చిట్ చాట్  లో భాగంగా మాట్లాడిన జయవర్ధనే బుమ్రాను కెప్టెన్ గా నియమించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇది అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ లకు కెప్టెన్ గా నియమించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక ఫాస్ట్ బౌలర్ జట్టు కెప్టెన్ గా ఉండాలంటే ఎంతో కష్టపడాలి.  టెస్ట్ క్రికెట్ లో అయితే అనేక సవాళ్ళతో కోరుకున్నది. ఇక బుమ్రా టెస్ట్ కెప్టెన్సీ కి  సరైన వాడు. గత కొన్నేళ్లుగా ట్రెండ్ మారుతోంది. ఆస్ట్రేలియాకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా మారిన తర్వాత మిగతా దేశాల క్రికెట్ బోర్డులు అదే దారిలో వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నాయ్. బౌలర్ కెప్టెన్ గా ఉండడం గొప్ప విషయం. ఎందుకంటే ఆట ఎలా సాగుతుందో చూస్తారు.. దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. జట్టు కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన లోనే ఉంటారు.


 అదికాక ఫాస్ట్ బౌలర్  కెప్టెన్ అయితే ఎప్పుడు వికెట్ల మీదే  ద్యాస ఉంటుంది. ఇక బుమ్రాకు టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో మక్కువ ఐపీఎల్ సమయంలో చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని నాతో పంచుకున్నాడు. పరిమిత ఓవర్ల కంటే టెస్ట్ క్రికెట్ ఆడటం ఎంతో ఇష్టం.. ఒక్క మ్యాచ్ కూడా మిస్ చేయకుండా ఆడాలి అని అతను అనుకుంటూ ఉంటాడు అని చెప్పుకొచ్చాడు  జయవర్ధనే.

మరింత సమాచారం తెలుసుకోండి: