ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య  జట్టుతో జరుగుతున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. అయితే  టెస్ట్ మ్యాచ్లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది టీమిండియా. ఇందులో భాగంగా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 98 పరుగులు వద్ద ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఇంగ్లాండ్ బౌలర్లపై వీరవిహారం చేసి 146 పరుగులతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట లో భాగంగా అటు రవీంద్ర జడేజా సైతం 104 పరుగులతో సెంచరీ చేసి అదరగొట్టాడు. ఈ ఇద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్ అటు టీమిండియాకు భారీ స్కోరు అందించడంలో ఎంతో సహాయపడింది అని చెప్పాలి.


 ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఇక వీరి విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రవర్తించిన తీరు మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. మొదటి రోజు ఆట లో భాగంగా రిషబ్ పంత్ సెంచరీ చేసిన సమయంలో డగౌట్  లో ఉన్న రాహుల్ ద్రవిడ్ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేశాడు. ఒకరకంగా ఎగిరి గంతేసినంత పని చేశాడు. అయితే ఎప్పుడూ సైలెంట్గానే ప్రోత్సహించే రాహుల్ ద్రవిడ్  ఇలా ఎంజాయ్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత రవీంద్ర జడేజా సెంచరీ చేసిన సమయంలో మాత్రం రాహుల్ ద్రవిడ్ నుంచి ఇలాంటి రియాక్షన్ కనిపించలేదు.


 మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం జడేజా సెంచరీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సెలబ్రేట్ చేస్తూ అభినందనలు తెలిపాడు. ఇక సిరాజ్ సైతం అభినందనలు తెలిపాడు. అయితే వీరిద్దరి వెనక నిలబడి ఏదో మొక్కుబడిగా సెలబ్రేట్ చేరుతున్నట్లు కనిపించాడు ద్రావిడ్. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే రవీంద్ర జడేజా టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కి చేరిన సమయంలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం రిషబ్ పంత్, రవీంద్ర జడేజా విషయంలో అటు రాహుల్ ద్రవిడ్  వ్యవహరించిన  తీరు మాత్రం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: