ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో భాగంగా జస్ప్రిత్ బుమ్రా అదరగొట్టాడు . ఎవరూ ఊహించని విధంగా ఏకంగా ఒకే ఓవర్లో సిక్సర్లతో చెలరేగి 29 పరుగులు పిండుకున్నాడు. అది కూడా వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో. ఇది కాస్త ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పాలి. అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. ఫాస్ట్ బౌలర్ బూమ్రా ఏంటి.. ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడటం ఏంటి అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు. దీంతో ప్రస్తుతం ఇక బుమ్రా ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి..


 అయితే ఇక బుమ్రా ఇన్నింగ్స్ పై ఇటీవలే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2007లో యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి 36 పరుగులు చేయడం కంటే ఆశ్చర్య కరమైన విషయాన్ని తాను చూశాను అంటూ బూమ్రా బ్యాటింగ్ ని ఉద్దేశిస్తూ ఆకాశానికి ఎత్తేశాడు రవిశాస్త్రి. సాధారణంగా క్రికెట్ లో ఇప్పటి వరకు అన్నీ చూసాము అని మీరు అనుకోవచ్చు. కానీ ఇంకా అంతకంటే గొప్పవి చూస్తారని అభిప్రాయం వ్యక్తం చేశాడు రవిశాస్త్రి . ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జస్ప్రిత్ బూమ్రా ఏకంగా వరల్డ్ రికార్డు నెలకొల్పడం అద్భుతం అంటూ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.


 ఇక రవిశాస్త్రి తో పాటు సచిన్ టెండుల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ సహా మరి కొంతమంది మాజీ ఆటగాళ్లు కూడా తాము జస్ప్రిత్ బూమ్రా ఇన్నింగ్స్ తో ఒక్క సారిగా షాక్ లో మునిగిపోయాము అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉండడం గమనార్హం. కాగా 84వ ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన మొదటి బంతిని ఫోర్ కొట్టిన జస్ప్రిత్ బూమ్రా తర్వాత బంతిని సిక్సర్ కొట్టాడు. దీంతో ఆశ్చర్యపోయిన స్టువర్ట్ బ్రాడ్ ఒత్తిడి లో మునిగిపోయాడు. దీంతో వరుసగా ఐదు వైడ్ బాల్స్ వేసాడు. అదనంగా ఐదు పరుగులు ఇండియా కు కలిసి వచ్చాయి. ఆ తర్వాత ఒక నోబాల్ వేసాడు. ఇక చివరి బంతుల్లో కూడా వరుసగా హ్యాట్రిక్ ఫోర్లతో అదరగొట్టేశాడు జస్ప్రిత్ బూమ్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: