గత ఏడాది కరోనా వైరస్ కారణంగా వాయిదా పడి ఇక ఇప్పుడు రీషెడ్యూల్ చేయబడిన టెస్ట్ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా మారుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టు అనుకున్నట్లుగానే మంచి ప్రదర్శన చేస్తోంది. జస్ప్రిత్ బూమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా  ఓడించే దిశగా ముందుకు సాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే గత కొంత కాలం నుంచి అద్భుతమైన ఫాంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్ట్రో ఇటీవలే టెస్ట్ మ్యాచ్లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేశాడు.


 అప్పటికే మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగుల వద్ద ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో జానీ బెయిర్ స్ట్రో అదరగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా సెంచరీతో చెలరేగిన పోయాడు. ఈ క్రమంలోనే టెస్టులలో ఎక్కువ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరూ జానీ బెయిర్ స్ట్రో సాధించిన  రికార్డు గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ లో ఎవరు ఎక్కువ సెంచరీలు సాధించారు అన్న విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ లో జానీ బెయిర్ స్ట్రో 5  సెంచరీలు సాధించి ఇక టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉండటం గమనార్హం. జానీ బెయిర్ స్ట్రో తర్వాత ఉస్మాన్ ఖావజా టెస్ట్ ఫార్మాట్ క్రికెట్లో ఈ ఏడాది ఏకంగా నాలుగు సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 4 సెంచరీలతో ఈ లిస్టులో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. డారేల్ మిచేల్  సైతం ఇక టెస్టు ఫార్మాట్లో మూడు సెంచరీలు చేసి ఇక ఈ ఏడాది టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: