ఇంగ్లండ్ జట్టులో స్టార్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్న బెయిర్ స్ట్రో గత కొంత కాలం నుంచి పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. తన కెరీర్లో మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న బెయిర్ స్ట్రో ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇంగ్లాండ్ జట్టును విజయతీరాలకు నడిపిస్తూ ఉన్నాడు. గత కొంత ఇంగ్లాండ్ జట్టు ఆడుతున్న టెస్టు మ్యాచులలో కూడా వరుస సెంచరీలతో చెలరేగిన ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బౌలర్ ఎవరైనా బంతి ఎక్కడ వేసిన బౌండరీకి తరలించడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్న బెయిర్ స్ట్రో ఇక తన అభిమానులకు సైతం తన బ్యాటింగ్ తీరుతో  ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు.


 ఇటీవలే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్ లో భాగంగా వరుసగా సెంచరీలతో చెలరేగిన పోయిన బెయిర్ స్ట్రో ఇక ఇప్పుడు టీమిండియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో కూడా అదరగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో రెండు సెంచరీలతో తనకు తిరుగు లేదు అని నిరూపించిన బెయిర్ స్ట్రో ఇక ఇప్పుడు భారత్ తో జరుగుతున్న టెస్టు మ్యాచులో కూడా 106 పరుగులు సెంచరీతో అదరగొట్టాడు. ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్ట్రో అదరగొట్టేశాడు అని చెప్పాలి.



 ఒకవైపు ఎంతో ఆచితూచి ఆడుతూనే మరో వైపు భారత బౌలర్లపై చెడుగుడు ఆడేసాడు. ఈ క్రమంలోనే అతని ఆటతీరుపై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన బెయిర్ స్ట్రో ఇక అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఏడాది టెస్ట్ ఫార్మాట్ లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు బెయిర్ స్ట్రో ఈ ఏడాది ఐదు సెంచరీలు చేశాడు. అయితే అంతేకాకుండా వరుసగా ఇంగ్లాండ్ తరఫున  మూడు టెస్టులలో వరుసగా సెంచరీ చేసిన 14వ  ఆటగాడిగా అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు ఈ స్టార్ బ్యాట్స్ మెన్.

మరింత సమాచారం తెలుసుకోండి: