ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఎవరు గెలుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా టీ20, వన్డే మ్యాచులు అంటే ఎంతో ఆసక్తిగా వీక్షించే ప్రేక్షకుల ఇక ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ను కూడా ఎంతో ఆసక్తికరంగా టీవీలకు అతుక్కుపోయి వీక్షిస్తున్నారు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే నిన్నటి వరకు కూడా భారత జట్టు విజయం సాధించేలాగా కనిపించింది. కాని ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ప్రస్తుతం మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో ఎవ్వరికి విజయం వరిస్తుంది  అనేది ఆసక్తికరంగా మారింది.


  టెస్టులో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తుండగా.. ఎట్టి పరిస్థితుల్లో టెస్ట్ మ్యాచ్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుని చారిత్రాత్మక విజయం సాధించాలని చూస్తుంది టీమిండియా. అయితే భారత్ విధించిన 378 పరుగుల టార్గెట్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఇంగ్లాండ్ జట్టు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న జో రూట్ 76, బెయిర్ స్టో 72 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్కు వీరిమధ్య 150 పరుగుల భాగస్వామ్యం ఉండటం గమనార్హం.


 అయితే ఇక ఇంగ్లాండ్ జట్టు గెలవాలంటే 90 ఓవర్లలో 119 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఇది పెద్ద కష్టమేమి కాదు.  అదే సమయంలో మరో ఏడు వికెట్లు పడగొడితే టీమిండియాకు  విజయం వరిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు జోరు మీద ఉన్న నేపథ్యంలో ఇది కాస్త కష్టమే అని చెప్పాలి. కానీ అసాధ్యమేమీ కాదు. ఈ నేపథ్యంలో నేటి మార్నింగ్ సెషన్ భారత్ కు ఎంతో కీలకంగా మారనుంది. ప్రస్తుతం క్రీజులో పాతుకుపోయిన రూట్, బెయిర్ స్టో లను అవుట్ చేస్తే  మ్యాచ్ మళ్లీ ఇండియా వైపు వస్తుంది. ఇలా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారిపోయిన నేపథ్యంలో అటు అభిమానులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: