మొన్నటివరకు శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లో కొనసాగాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా మంచి పరుగులు చేశాడు. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం బ్యాటింగ్లో తీవ్ర ఇబ్బంది పడిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ లో కూడా పెద్దగా పరుగులు చేయలేక నిరాశపరిచిన  శ్రేయస్ అయ్యర్ టీమ్ ఇండియా తరఫున ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు అని చెప్పాలి. ముఖ్యంగా అతని  బలహీనతను బౌలర్లు బలంగా మార్చుకుని చివరికి అతని వికెట్ తీసుకుంటున్నారు.


 అన్ని రకాల బంతులను ఎంతో అలవోకగా ఆడే  శ్రేయస్ అయ్యర్ షార్ట్ పిచ్ బంతులను మాత్రం ఆడటానికి తెగ ఇబ్బంది పడి పోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇలాంటి బంతులు సందించిన సమయంలో ఇబ్బంది పడుతూ వికెట్లు కోల్పోవడం లాంటి వి కూడా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ బౌలర్లు శ్రేయస్ అయ్యర్ బలహీనతనే తమ బలంగా మార్చుకున్నారు. ఇటీవలె టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఇలాంటి షార్ట్ పిచ్ బంతితోనే అతన్ని వికెట్ తీశారు అనే విషయం తెలిసిందే.  ఇక రెండో ఇన్నింగ్స్ లోను షార్ట్ పిచ్ బంతితో  శ్రేయస్ అయ్యర్ ను బుట్టలో వేసుకున్నారు.


 కాగా తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ షార్ట్ పిచ్ బంతికి చివరికి శ్రేయస్ అయ్యర్ 15 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. ఇటీవల జరిగిన రెండో ఇన్నింగ్స్ లో కూడా మరోసారి ఇలాంటి బంతికే వికెట్ కోల్పోయాడు. 19 పరుగుల వద్ద పార్ట్ పిచ్ బంతికి పాట్స్ బౌలింగ్ లో వికెట్ కోల్పోయాడు శ్రేయస్ అయ్యర్. అయితే ఈ ఇన్నింగ్స్ లో అతను ఎదుర్కొన్న 26 బంతుల్లో 19 షార్ట్ పిచ్ బంతులు వేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఇంగ్లండ్ జట్టు శ్రేయస్ అయ్యర్ ని అవుట్ చేసేందుకు కచ్చితమైన ప్రణాళికతోనే బరిలోకి దిగింది అన్నది తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: