ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య గత సంవత్సరం జరగాల్సిన ఆఖరి మరియు 5 వ టెస్ట్ ను కొన్ని కారణాల వలన వాయిదా వేయడం జరిగింది. అలా ఆగిన టెస్ట్ ను జులై 1 న జరపడానికి ఐసీసీ నిర్ణయించింది. ఈ రోజు ఆ మ్యాచ్ లో అయిదవ రోజు కావడం గమనార్హం. కానీ టెస్ట్ మ్యాచ్ లు ఎప్పుడు ఏ విధంగా మారుతాయి అన్నది ఎవ్వరూ ఊహించలేరు. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. మొదటి మూడు రోజులు ఇండియా తమ ఆధిపత్యాన్ని చలాయించింది. వాస్తవంగా ఈ మ్యాచ్ లో ఫేవరెట్ అయితే ఇంగ్లాండ్ అని అంతా అనుకున్నారు. ఎందుకంటే దీనికి ముందు కివీస్ తో జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ క్లీన్ సీపీ చేసింది. ఇంగ్లాండ్ కు కొత్త కెప్టెన్ మరియు కొత్త కోచ్ లు దొరకడంతో ఎంతో ఉత్సాహంగా దూసుకుపోతోంది.

అదే ఉత్సాహంతో ఇండియాతో తలపడింది. కానీ సీనియర్ లు విఫలం అయిన చోట కీపర్ రిషబ్ పంత్ మరియు జడేజాలు సెంచరీలతో కదం తొక్కడంతో ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసింది. కానీ ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్ లో దారుణంగా ఫెయిల్ అయింది. కేవలం 284 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే రెండవ ఇన్నింగ్స్ లోనూ ఇండియా నాలుగవ రోజు 200 కు పైగా పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ముఖ్యంగా పంత్ మొదటి ఇన్నింగ్స్ లో లాగా అద్భుతంగా ఆడుతున్నాడు. సరిగ్గా 57 పరుగుల వద్ద ఉండగా జాక్ లీచ్ ఓవర్ లో అనవసరమైన స్వీప్ షాట్ కు ఆడి స్లిప్ లో ఉన్న రూట్ కు దొరికిపోయాడు.

ఇక అప్పటి నుండి వరుసగా వికెట్లు కోల్పోయి దారుణంగా 245 పరుగులకే చాపచుట్టేసింది. అలా ఇంగ్లాండ్ కు ఒకటిన్నర రోజుకు పైగా సమయం ఉండగా 378 పరుగుల టార్గెట్ సాధించాల్సి వచ్చింది. కానీ రికార్డ్  ప్రకారం చూస్తే ఈ స్కోర్ ను ఇంగ్లాండ్ చరిత్రలో చేధించలేదు. కానీ దూకుడైన ఆటకు మారుపేరుగా నిలిచినా బెన్ స్టోక్స్ టీమ్ అద్భుతంగా ఆడి ఇండియాను ఓడించింది. ఒకవేళ పంత్ కనుక జాగ్రత్తగా ఆడి మరికొన్ని పరుగులు జోడించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఈ మ్యాచ్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: